Drugs Case : పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌.. డ్రగ్స్‌ కేసులో కీలకంగా మారిన సీసీ టీవీ ఫుటేజ్‌

పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో 20మంది వీఐపీలకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. మేనేజర్‌ అనిల్‌, అభిషేక్‌ కనుసన్నల్లోనే డ్రగ్స్‌ సప్లై చేసినట్లు ఖాకీలు తేల్చారు.

Drugs Case : పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌.. డ్రగ్స్‌ కేసులో కీలకంగా మారిన సీసీ టీవీ ఫుటేజ్‌

Drug Case (1)

Updated On : April 9, 2022 / 6:23 PM IST

Pudding and Mink Pub : పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడప్‌ చేశారు. పబ్‌లో 20మంది వీఐపీలు డ్రగ్స్‌ తీసుకున్నట్లు గుర్తించిన ఖాకీలు.. మరిన్ని ఆధారాల కోసం సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. గత నెల రోజుల సీసీ ఫుటేజ్‌ చూస్తున్న పోలీసులు.. డ్రగ్స్‌ తీసుకున్న వారిని పక్కాగా గుర్తించే పనిలో ఉన్నారు. పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌పై పోలీసులు దాడి చేసినప్పుడు.. 148 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8మంది డ్రగ్‌ పెడ్లర్స్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 20మంది వీఐపీలకు ఈ 8మంది పెడ్లర్స్‌ డ్రగ్స్‌ ఇచ్చినట్లు ఖాకీ బాస్‌లు అనుమానిస్తున్నారు. పక్కా ఆధారాల కోసం నెల రోజుల సీసీ ఫుటేజ్‌ను జల్లెడ పడుతున్నారు.

పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో పార్టీ చేసుకున్న వాళ్లలో విదేశీయులు కూడా ఉన్నారు. ఆ రోజు వీరందర్నీ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లిన ఖాకీలు.. వివరాలు నమోదు చేసుకుని ఇంటికి పంపించారు. తదుపరి విచారణ కోసం తాజాగా విదేశీయుల ఇంటికి వెళ్లగా.. వారంతా అక్కడ్నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో సీసీ ఫుటేజ్‌లో అనుమానిత వ్యక్తులు, పాత డ్రగ్‌ పెడ్లర్స్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

Hyderabad : పుడింగ్‌ ఇన్‌ మింక్‌ పబ్‌ కేసులో సంచలన విషయాలు.. డ్రగ్స్‌ తీసుకున్న 20మంది వీఐపీలు

మరోవైపు ఆ రోజు 148మందిని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకురాగా.. వారందరి వివరాలు రాసుకుని ఇంటికి పంపించివేశారు. అనిల్‌, అభిషేక్‌, అర్జున్‌, కిరణ్‌రాజ్‌ను మాత్రమే ఈ కేసులో నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే పబ్‌కు వెళ్లినవారిలో 20మంది డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆధారాలు లభించినా.. వారిలో వీఐపీలుంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు పోలీసులు ధైర్యం చేస్తారా అన్న అనుమానాలు నెలకొన్నాయి.

పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో 20మంది వీఐపీలకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. మేనేజర్‌ అనిల్‌, అభిషేక్‌ కనుసన్నల్లోనే డ్రగ్స్‌ సప్లయ్‌ చేసినట్లు ఖాకీలు తేల్చారు. అభిషేక్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో గోవా, ముంబైకి చెందిన కొందరు వ్యక్తులున్నట్లు గుర్తించారు. గతంలో డ్రగ్స్‌తో పట్టుబడ్డ పెడ్లర్స్‌తో మేనేజర్‌ అనిల్‌కు లింకులున్నట్లు కూడా పోలీసులకు తెలిసింది. గోవా, ముంబై నుంచి అనిల్‌ డ్రగ్స్‌ తెప్పించినట్లు ప్రూఫ్స్‌ దొరకడంతో.. అతడి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది.