Raghunandan: కేటీఆర్‌పై రఘునందన్ ఫైర్.. “వాస్తవాలు బయటకొస్తాయనే అలా”
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామయాత్ర కాదని ప్రజావంచన యాత్ర అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేస్తుంటే.. మరోవైపు రఘనందన్ కేటీ

Ktr Raghunandan
Raghunandan: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామయాత్ర కాదని ప్రజావంచన యాత్ర అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేస్తుంటే.. మరోవైపు రఘనందన్ కేటీఆర్ పై కౌంటర్ విసురుతున్నారు.
24గంటలు ఉచిత కరెంటు ముచ్చటే లేదని విమర్శిస్తూ.. కేటీఆర్‌కు తొందర ఎక్కువైందన్నారు. టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయనే ఆందోళన కేటీఆర్‌లో కన్పిస్తుందని కామెంట్ చేశారు. నిరుద్యోగభృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు, డబుల్ బెడ్ రూంఇళ్ళు కోసమే బండి పాదయాత్ర చేస్తున్నారని వెల్లడించారు.
సీఎం కేసీఆర్ సంతకం వలనే కృష్ణాజిలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. 290టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టిన విషయం కేటీఆర్‌కు తెలియకపోవటం హాస్యాస్పదంగా ఉంది. వాస్తవాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతోనే రిటైర్ అయిన అధికారులను కొనసాగిస్తున్నారు. గజ్వేల, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మాత్రమే 24గంటల కరెంట్”
Read Also : ప్రజాసంగ్రామ యాత్ర కాదు…ప్రజావంచన యాత్ర-కేటీఆర్
“మా ఊరితో సహా.. ప్రభాకరరావు, మంత్రి ఎర్రబెల్లి ఊళ్లలో కూడా 24గంటల కరెంటు ఇవ్వడం లేదు. మోటార్లుకు మీటర్లు పెడతారన్న మంత్రి హరీష్ రావు ఇప్పుడేమి చెప్తారు? రైతుల డిమాండ్ మేరకు రాత్రిపూట కూడా కరెంటు ఇవ్వాలి. నదీ జలాల పంపకంపై ప్రతినిధుల బృందం ఏర్పాటు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది”
“సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్ళటం కారణంగానే కృష్ణా నదీజాలాల పంపకాల్లో జాప్యం. ఎండుతోన్న పంటతో తెలంగాణ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉచిత కరెంట్‌పై ఫీల్డ్ లెవల్ లో వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్తోన్న టీఆర్ఎస్ పెద్దలు చర్చకు రావాలి” అని పిలుపునిచ్చారు రఘునందన్.