Praja Sangrama Pada Yatra : ప్రజాసంగ్రామ యాత్ర కాదు…ప్రజావంచన యాత్ర-కేటీఆర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామయాత్ర కాదని ప్రజావంచన యాత్ర అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఘాటుగా విమర్శించారు.

Praja Sangrama Pada Yatra : ప్రజాసంగ్రామ యాత్ర  కాదు…ప్రజావంచన యాత్ర-కేటీఆర్

Ktr And Bandi Sanjay Kumar

Updated On : April 15, 2022 / 12:39 PM IST

Praja Sangrama Pada Yatra :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ప్రజా సంగ్రామయాత్ర కాదని ప్రజావంచన యాత్ర అని టీఆర్ఎస్ పార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఘాటుగా విమర్శించారు. జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అనివిమర్శిస్తూ కేటీఆర్ ఒకలేఖ విడుదల చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ.. పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా..?అంటూ కేటీఆర్ బండి సంజయ్ ను ప్రశ్నించారు.

పచ్చ బడుతున్న పాలమూరుపై కక్ష కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదని కేటీఆర్ అన్నారు. పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా..? అని ఆయన బీజేపీ నాయకులను ప్రశ్నించారు. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తున్నారు.

పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా..?అని కేటీఆర్ అన్నారు. పాలమూరుకు ఇంతవరకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ బండి సంజయ్ ను ఆ లేఖలో అడిగారు. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో … సమాధానం చెప్పాలి? అని కేటీర్ డిమాండ్ చేశారు.

Also Read : Pudding And Mink Pub : మూడు టేబుళ్లపై దొరికిన కొకైన్ ఆధారంగా కేసు విచారణ
తెలంగాణ అంటే గిట్టని పార్టీ బీజేపీ అని… కడుపులో ద్వేషం పెట్టుకుని కపటయాత్రలుచేసి ఏమి లాభం అని కేటీఆర్ అన్నారు. ప్రాజక్టులకు జాతీయ హోదా ఇవ్వరు….ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్ల పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తారు. పండించిన పంటలు కొనకుండా రైతను గోస పుచ్చుకుంటారు…సందు దొరికితే చాలు తెలంగాణ మీద విషం గక్కుతారు ..వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా..? అవి కేటీఆర్ బండి సంజయ్ ను ప్రశ్నించారు.