గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నప్పటికీ కొందరు అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. వారి నిర్లక్ష్యం కారణంగా ఓ ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కొత్తగూడ మండలం తిరుమల గండి గ్రామానికి చెందిన ఈసం రుత్విక్.. తనను అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు తరుచూ వేధిస్తున్నాడని అన్నాడు.
ఈ విషయం పై పలుమార్లు వార్డెన్ కు, ఉపాధ్యాయులకు తెలిపినా వారు పట్టించుకోలేదన్నాడు. శనివారం ఉదయం హాస్టల్లో విద్యార్థుల కోసం ఉపయోగించే ఎలర్జీ మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడికి మొదట గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Parent-Teacher Meeting in AP: పేరెంట్స్- టీచర్స్ మీట్ లో విద్యార్థులతో ముచ్చటించిన చంద్రబాబు, పవన్