Parent-Teacher Meeting in AP: పేరెంట్స్- టీచర్స్ మీట్ లో విద్యార్థులతో ముచ్చటించిన చంద్రబాబు, పవన్
ఏపీ వ్యాప్తంగా ఒకేరోజు శనివారం పేరెంట్స్ - టీచర్స్ మెగా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ..

Chandrababu Naidu, pawan kalyan
CM Chandrababu Naidu : ఏపీ వ్యాప్తంగా ఒకే రోజు శనివారం పేరెంట్స్ – టీచర్స్ మెగా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించి ఎలా చదువుతున్నారు. వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలా చదువుతున్నారు అనే విషయంపై ఎప్పటికప్పుడు దృష్టిసారించాలని, తద్వారా వారు మరింత మెరుగ్గా విద్యలో రాణించేలా చూడాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి చంద్రబాబు, మంత్రి లోకేశ్ భోజనం చేశారు. అంతకుముందు.. పదో తరగతి విద్యార్థి మీనాక్షి, బాలిక తల్లిదండ్రులతో చంద్రబాబు మాట్లాడారు. నాచురల్ గా పంట పండించి ఇవ్వాలనేది తన జీవిత లక్ష్యం అని విద్యార్థి మీనాక్షి సీఎం చంద్రబాబుకు వివరించారు.
పేరెంట్స్ – టీచర్స్ మీట్ లో భాగంగా కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. విద్యార్థులతో పవన్ ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పవన్ ప్రసంగించారు.