Rahul Gandhi Eyes Telangana : తెలంగాణపై రాహుల్ గాంధీ ఫోకస్.. పార్టీ నేతలతో కీలక సమావేశం

దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకించి కర్నాటక, తెలంగాణలపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. వరంగల్ లో రైతు గర్జనకు హాజరుకానున్నారు.(Rahul Gandhi Eyes Telangana)

Rahul Gandhi Eyes Telangana : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం భేటీ అయ్యింది. కొన్ని రోజులుగా ఆయా రాష్ట్రాల పార్టీ నేతలతో ఉమ్మడిగా సమావేశమవుతున్న రాహుల్ గాంధీ.. ఈసారి తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందంతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, జీవన్ రెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

వ్యక్తిగత పనుల కారణంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర లో ఉన్నందున ఆయన కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. తెలంగాణలో 40 లక్షల సభ్యత్వం పూర్తి అయ్యింది. సభ్యత్వం తీసుకున్న వారందరికీ భీమా సౌకర్యం కల్పించనున్నారు. దేశంలోనే అత్యధిక సభ్యత్వం చేసి ప్రధమ స్థానంలో నిలిచింది తెలంగాణా పీసీసీ. ఇందుకు సంబంధించిన రూ.6.5 కోట్ల చెక్కును రాహుల్ గాంధీకి నేతలు అందజేయనున్నారు.(Rahul Gandhi Eyes Telangana)

Rahul Gandhi : తెలంగాణలో పండిన ప్రతి గింజా కొనాలి.. తెలుగులో రాహుల్ గాంధీ ట్వీట్..!

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ఇప్పటివరకు పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యాచరణ గురించి రాహుల్ తో నేతలు చర్చించనున్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకించి కర్నాటక, తెలంగాణలపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. నిన్న కర్నాటక నేతలతో ఆయన సమావేశం అయ్యారు. రేపు, ఎల్లుండి కర్నాటకలో పర్యటించనున్నారు రాహుల్ గాంధీ. తెలంగాణపైనా ప్రత్యేక దృష్టి పెట్టిన రాహుల్ గాంధీ.. వరంగల్ లో రైతు గర్జనకు హాజరుకానున్నారు. రాహుల్ సమయాన్ని బట్టి గర్జన తేదీని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖరారు చేయనున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ధాన్యం కొనుగోలు అంశంపైనా ఇటీవలే రాహుల్ గాంధీ ట్వీట్ తెలుగులో ట్వీట్‌ చేశారు. ‘తెలంగాణలో పండిన చివరి గింజ కొనే వరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ.(Rahul Gandhi Eyes Telangana)

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

TRS-Congress : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ధాన్యం వార్‌.. కవిత ట్వీట్‌కు మాణిక్కం ఠాగూర్‌, ఎంపీ కోమటిరెడ్డి కౌంటర్‌

మరోవైపు వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉద్యమానికి సిద్ధమైంది. నెల రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

ట్రెండింగ్ వార్తలు