TRS-Congress : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ధాన్యం వార్‌.. కవిత ట్వీట్‌కు మాణిక్కం ఠాగూర్‌, ఎంపీ కోమటిరెడ్డి కౌంటర్‌

కవిత ట్వీట్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్‌ వేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై తాము రాజీనామాకు సిద్ధమని, టీఆర్‌ఎస్‌ ఎంపీలు రాజీనామా చేస్తారా అని సవాల్‌ చేశారు.

TRS-Congress : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ధాన్యం వార్‌.. కవిత ట్వీట్‌కు మాణిక్కం ఠాగూర్‌, ఎంపీ కోమటిరెడ్డి కౌంటర్‌

Kavitha

TRS and Congress Grain war : కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ మధ్య ట్విట్టర్‌లో ధాన్యం వార్‌ ముదురుతోంది. ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌కు మాణిక్కం ఠాగూర్‌ కౌంటర్‌ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్టమెంట్‌ వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేయడం లేదని.. బిర్యానీలు, డోక్లా తింటూ సెంట్రల్‌ హాల్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు ఠాగూర్‌. 2021 ఆగస్టులో ఎఫ్‌సీఐతో ఒప్పందం కుదుర్చుకుంది ఎవరో మర్చిపోకూడదంటూ.. కవితపై విమర్శలు గుప్పించారు ఠాగూర్‌. అటు.. కవిత ట్వీట్‌పై కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌ సైతం కౌంటర్‌ అటాక్‌ మొదలెట్టారు. పార్లమెంట్‌ వెల్‌లో డ్రామాలు చేయడం కాదని.. వడ్లు కొనాలంటూ సూచించారు. స్వార్థ రాజకీయాల కోసం పేద రైతులను బలి చేయకండంటూ ట్వీట్‌ చేశారు శ్రావణ్.

అంతకు ముందు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్లకు.. ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. తెలంగాణ రైతుల కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా కవిత ట్వీట్ చేశారు. రాహుల్‌ ఎంపీగా ఉండి.. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్‌లో సంఘీభావం తెలపడం కాదని.. నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలపాలంటూ రాహుల్‌కు కవిత సవాల్‌ విసిరారు. ఒకే దేశం.. ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హర్యానాకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉందంటూ కవిత ట్వీట్ చేశారు.

Telangana : ధాన్యం దంగల్-తెలంగాణ, కేంద్రం మధ్య ముదురుతున్న వార్‌

కవిత ట్వీట్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్‌ వేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై తాము రాజీనామాకు సిద్ధమని, టీఆర్‌ఎస్‌ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారా అని సవాల్‌ విసిరారు. రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందన్నారు కోమటిరెడ్డి. ధాన్యం సేకరణ విషయంలో అందరం కలిసి ఢిల్లీ వేదికగా ధర్నా చేయడానికైనా రెడీగా ఉన్నామని అన్నారు.