Rahul Gandhi : తెలంగాణలో పండిన ప్రతి గింజా కొనాలి.. తెలుగులో రాహుల్ గాంధీ ట్వీట్..!
Rahul Gandhi : తెలంగాణ రైతు సమస్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఖరిపై ఆయన మండిపడ్డారు.

Rahul Gandhi Congress Party Leader Rahul Gandhi Demands Trs Govt To Buy Paddy From Telangana Paddy Farmers
Rahul Gandhi : తెలంగాణ రైతు సమస్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఖరిపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ.. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభ పెట్టే పనులు మానాలని హితవు పలికారు.
రాష్ట్రంలో పండించిన ప్రతి గింజను ప్రభుత్వాలు కొనాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుందని రాహుల్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ తెలుగులో ట్వీట్ (#FightForTelanganaFarmers) చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.
రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022
వరి ధాన్యం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉద్యమానికి సిద్ధమైంది. నెల రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి నిర్వహించింది. ఈ క్రమంలో వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఇప్పటికే తెలంగాణ పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుధీర్ఘంగా సమావేశమైన సంగతి తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి సమావేశంలో చర్చించారు.
సీనియర్ నేతలు జిల్లాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి మాజీ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. వరి ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఏప్రిల్ 7న విద్యుత్ సౌధ వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించనున్నారు.
Read Also : Gutta Sukhendar Reddy : ధాన్యం విషయంలో కేంద్రం రైతులను ఇబ్బంది పెట్టొద్దు : గుత్తా సుఖేందర్ రెడ్డి