Rahul Gandhi : తెలంగాణకు రాహుల్, ప్రియాంక గాంధీ.. మూడు రోజుల కాంగ్రెస్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు

బస్సు యాత్రలో భాగంగా మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు చెరుకు రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. Rahul Gandhi

Rahul Gandhi Priyanka Gandhi Telangana Tour

Rahul Gandhi Priyanka Gandhi Telangana Tour : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలను బరిలోకి దింపుతున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ రంగంలోకి దిగేశారు. వరుసగా పర్యటనలు చేస్తూ భారీ బహిరంగ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రేపు (అక్టోబర్ 18) తెలంగాణకు కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వస్తున్నారు. తెలంగాణలో మూడు రోజుల పాటు కాంగ్రెస్ బస్సు యాత్ర ఉంటుంది. 8 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుంది. బస్సు యాత్రలో భాగంగా మహిళలు, నిరుద్యోగులు, సింగరేణి కార్మికులు, పసుపు చెరుకు రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.

Also Read : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?

బస్సు యాత్ర షెడ్యూల్..
* రాహుల్, ప్రియాంక స్పెషల్ ఫ్లైట్ లో రేపు సాయంత్రం 3.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
* బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో రామప్ప టెంపుల్ కు వెళ్తారు.
* రామప్ప టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేస్తారు.
* సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
* బస్సు యాత్ర రామప్ప గుడి నుంచి ములుగు చేరనుంది.
* ములుగులో కాంగ్రెస్ బహిరంగ సభలో మహిళలతో రాహుల్, ప్రియాంక ప్రత్యేక సమావేశం కానున్నారు.

* ములుగు సభ తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లనున్న ప్రియాంక గాంధీ.
* ములుగు బహిరంగసభ తర్వాత బస్సు యాత్ర భూపాలపల్లి చేరుకుంటుంది.
* భూపాలపల్లిలో నిరుద్యోగ యువతతో కలిసి రాహుల్ ర్యాలీ నిర్వహిస్తారు.
* అనంతరం భూపాలపల్లిలోనే బస చేస్తారు.
* 19వ తేదీన భూపాలపల్లి నుంచి మంథనికి చేరుకోనున్న బస్సు యాత్ర.
* మంథనిలో పాదయాత్రలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారు.

Also Read : కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

* మంథని నుంచి పెద్దపల్లి వెళ్లనున్న బస్సు యాత్ర.
* పెద్దపల్లి నుంచి కరీంనగర్ కు బస్సు యాత్ర.
* కరీంనగర్ లో రాత్రి బస చేయనున్న రాహుల్ గాంధీ.
* 20వ తేదీన కరీంనగర్ నుంచి బోధన్ ఆర్మూరు మీదుగా నిజామాబాద్ కు కాంగ్రెస్ బస్సు యాత్ర.
* బోధన్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించనున్న రాహుల్ గాంధీ.
* ఆర్మూరులో కాంగ్రెస్ బహిరంగ సభ.
* పసుపు చెరుకు రైతులతో రాహుల్ ప్రత్యేక సమావేశం.
* నిజామాబాద్ లో పాదయాత్రలో పాల్గొననున్న రాహుల్, టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు.
* 20వ తేదీ సాయంత్రం ముగియనున్న టీ కాంగ్రెస్ మొదటి విడత బస్సుయాత్ర.

ట్రెండింగ్ వార్తలు