Rahul Gandhi : కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారింది.. లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ : రాహుల్ గాంధీ

బీఆర్ఎస్ కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ ను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Rahul Gandhi Visit Medigadda project

Rahul Gandhi Criticism BRS : ప్రజా సంపదను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందని ఆరోపించారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ డబ్బంతా కక్కిస్తామని పేర్కొన్నారు.

భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలో రాహుల్ గాంధీ పర్యటించారు. మేడిగడ్డ ప్రాజెక్టును రాహుల్ పరిశీలించారు. మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సుకు రాహుల్ గాంధీ హాజరై ప్రసంగించారు. దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు.

CPM : పొత్తుపై క్లారిటీ ఇవ్వాలి లేకుంటే మా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తాం.. కాంగ్రెస్ కు మరోసారి సీపీఎం డెడ్ లైన్

బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఒకవైపు ఉన్నాయని, కాంగ్రెస్ మరో వైపు ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు మధ్యే ప్రధాన పోటీ అన్నారు. బీఆర్ఎస్ కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ ను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి ఏటీఎంగా మారిందని ఆరోపించారు.

లక్ష కోట్ల తెలంగాణ సంపద దోపిడీకి గురైందన్నారు. రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణలో ప్రతీ కుటుంబంపై అప్పు భారాన్ని మోపారని విమర్శించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చూస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ, బీఆఆర్ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

CPM : పొత్తుపై క్లారిటీ ఇవ్వాలి లేకుంటే మా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తాం.. కాంగ్రెస్ కు మరోసారి సీపీఎం డెడ్ లైన్

మోదీ, కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.12 వందలకు చేరిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ను రూ.500కు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్మీ పథకంలో భాగంగా మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు