Telangana Rains : భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణలో రానున్న 5 రోజులు వానలు

కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ నెలలో సాధారణ.. Telangana Rains Update

Heavy rainfall

Telangana Rains Update : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కాగా, వర్షాలు కంటిన్యూ అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 5 రోజులు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

Hyderabad : బీకేర్ ఫుల్.. భారీ లాభాల పేరుతో ఘరానా మోసం, కోట్లు స్వాహా చేసిన ఏలూరుకి చెందిన దంపతులు

హైదరాబాద్ లో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇప్పటికే 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పింది.

ఈ రోజు(సెప్టెంబర్ 3) తెల్లవారుజాము నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చాలా చోట్ల 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరో 5 రోజులు ఉమ్మడి పది జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందన్నారు. ఉత్తర తెలంగాణలో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.(Telangana Rains)

నిన్నటి వరకు ఎండలు మండిపోయాయి. వాతావరణం సెకండ్ సమ్మర్ ను తలపించింది. మండుటెండలు ఠారెత్తించాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన వేడి, ఉక్కపోతతో జనాలు విలవిలలాడిపోయారు. రుతుపవనాలు ముఖం చాటేశాయి. వాన జాడే లేకుండా పోయింది. దీంతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది.

ఇప్పుడు విస్తారంగా వానలు పడుతుండటంతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభించడంతో జనాలు ఊపిరిపీల్చుకున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణలో మళ్లీ వానలు పడుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలో వానలు పడ్డాయి. ఆ తర్వాత వానల జాడే లేదు. ఇప్పుడు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. అటు అన్నదాతల్లోనూ హర్షం వ్యక్తమవుతోంది. (Telangana Rains)

శ్రావణి, హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి..
ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం వచ్చే 48 గంటల్లో అల్పపీడనంగా మారొచ్చు. అల్పపీడనం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో వచ్చే 5 రోజులు తెలంగాణ రాష్ట్రం మొత్తం మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉంది. విస్తారంగానూ వానలు కురుస్తాయి. వచ్చే 24 గంటల్లో ఉత్తర ఈశాన్య తెలంగాణలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది.

వచ్చే మూడు రోజులు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలులో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ ఎల్లో అలర్ట్ ఇచ్చారు.

Hyderabad : బీకేర్ ఫుల్.. భారీ లాభాల పేరుతో ఘరానా మోసం, కోట్లు స్వాహా చేసిన ఏలూరుకి చెందిన దంపతులు

గతేడాదితో పోలిస్తే ఆగస్టు నెలలో తక్కువ వర్షపాతం నమోదైంది. 60శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల మొత్తం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే రానున్న మూడు రోజులు ఎల్లో అలర్ట్ ఉండే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వాన పడే అవకాశం ఉంది. (Telangana Rains)

ట్రెండింగ్ వార్తలు