Hyderabad : బీకేర్ ఫుల్.. భారీ లాభాల పేరుతో ఘరానా మోసం, కోట్లు స్వాహా చేసిన ఏలూరుకి చెందిన దంపతులు

రాణి, ధర్మరాజు దంపతులను కలిసి విడతల వారిగా 7కోట్ల రూపాయలు ఇచ్చి ఆ విద్యాసంస్థలో శ్రీనివాస్ భాగస్వామిగా చేరారు. Hyderabad CCS Police

Hyderabad : బీకేర్ ఫుల్.. భారీ లాభాల పేరుతో ఘరానా మోసం, కోట్లు స్వాహా చేసిన ఏలూరుకి చెందిన దంపతులు

Hyderabad CCS Police

Hyderabad CCS Police : విద్యాసంస్థలో భాగస్వామ్యం అంటూ కోట్లు స్వాహా చేసిన కేసులో ఏలూరుకు చెందిన దంపతులు హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు. ఎన్ఆర్ఐని మోసగించిన కేసులో నందిగం రాణి, ధర్మరాజు దంపతులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా తడికలపూడిలో ఉన్న ఓ విద్యాసంస్థలో భాగస్వామ్యం ఇస్తామంటూ పలువురిని మోసగించినట్లు దంపతులపై ఏపీ, తెలంగాణలో కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్ కి చెందిన బాధితుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమెరికాలోని స్నేహితుడు సుధాకర్ సూచనతో రాణి, ధర్మరాజు దంపతులను కలిసి విడతల వారిగా 7కోట్ల 27లక్షల 85వేల 584 రూపాయలను ఇచ్చి ఆ విద్యాసంస్థలో శ్రీనివాస్ భాగస్వామిగా చేరారు. తాజాగా తన పెట్టుబడి సొమ్మును తిరిగి ఇవ్వమని కోరగా ఆ దంపతులు చంపుతామని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీనివాస్. దీంతో ధర్మరాజు, రాణి దంపతులను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సీసీఎస్ పోలీసులు. నిందితులకు నాంపల్లి కోర్టు 14 రిమాండ్ విధించింది.(Hyderabad CCS Police)

Also Read..Deepthi Case : ఆ వీడియోలో ఉన్నది చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ కాదు.. ఆ వీడియోను షేర్ చేయొద్దు- పోలీసుల కీలక సూచన

విద్యాసంస్థల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశారు రాణి, ధర్మరాజు దంపతులు. వీరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఏలూరుకి చెందిన రాణి, ధర్మరాజు.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తల నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇప్పటివరకు డబ్బు తిరిగి చెల్లించలేదు. పైగా డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన వారిని చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. దాదాపు 7 కోట్లు ఇచ్చుకుని మోసపోయిన బాధితుడు శ్రీనివాస్.. సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. దంపతులపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దంపతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇలాంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. భారీ లాభాలు వస్తాయని ఎవరైనా చెబితే.. అటువంటి వాటికి ఆశపడి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.

విద్యాసంస్థల్లో పెట్టుబడులు పెడితే భారీగా ప్రాఫిట్స్ వస్తాయని రాణి, ధర్మరాజు దంపతులు ఊరించారు. వారి మాటలు నమ్మి వారి చేతిలో మోసపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వీరి బాధితులు చాలా మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 35 కోట్ల వరకు వీరు వసూలు చేసినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు.

Also Read..Korutla Deepthi Case : కోరుట్ల దీప్తి కేసు.. 70తులాల బంగారం తీసుకుని ప్రియుడితో పారిపోయేందుకు చందన ఖతర్నాక్ స్కెచ్ , చివరి నిమిషంలో ఊహించని దారుణం

గుంటూరు, ఏలూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విద్యా సంస్థల్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి రాణి, ధర్మరాజు దంపతులు కోట్లు దండుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అయితే వీరు రూ.35 కోట్ల మేరకు మోసానికి పాల్పడినట్లు తెలిసింది. తీసుకున్న డబ్బు మొత్తం ఎక్కడికి తరలించారు? ఏం చేశారు? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.