Deepthi Case : ఆ వీడియోలో ఉన్నది చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ కాదు.. ఆ వీడియోను షేర్ చేయొద్దు- పోలీసుల కీలక సూచన

దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత ఓ వీడియో వైరల్ అయ్యింది. చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ కోరుట్ల బస్టాండ్ లో ఉన్నట్లుగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. Jagtial Deepthi Case

Deepthi Case : ఆ వీడియోలో ఉన్నది చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ కాదు.. ఆ వీడియోను షేర్ చేయొద్దు- పోలీసుల కీలక సూచన

Korutla Deepthi Murder Case (Photo : Google)

Jagtial Deepthi Case : సంచలనం రేపిన జగిత్యాల జిల్లా కోరుట్ల దీప్తి కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. దీప్తిది హత్య అని తేల్చిన పోలీసులు.. ఆమెను చంపింది సొంత చెల్లి చందనే అని కూడా నిర్ధారించారు. ఇంట్లో ఉన్న డబ్బు, నగదు తీసుకుని ప్రియుడితో పారిపోయే క్రమంలో చందన ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు వెల్లడించారు. నిజానికి అక్కని చంపాలని చెల్లి చందన అనుకోలేదని, అయితే పారిపోయే క్రమంలో ఘోరం జరిగిపోయిందన్నారు. తన అక్కని చంపిన చెల్లి చందన.. అక్కది సహజ మరణం అని సీన్ క్రియేట్ చేసిందన్నారు. దీప్తి మందు(వోడ్కా) తాగి చనిపోయిందని అని నమ్మించాలని చూసిందన్నారు. మొత్తంగా కాలేజీలో పరిచయం అయిన వ్యక్తితో ప్రేమ వ్యవహారమే ఈ ఘోరానికి దారితీసింది.

ఈ కేసుకి సంబంధించిన సంచలన విషయాలను జగిత్యాల ఎస్పీ భాస్కర్ మీడియాకు వెల్లడించారు. అసలేం జరిగింది? దీప్తిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆమెను ఎలా హత్య చేశారు? డబ్బు, నగదు తీసుకుని చందన ఏం చేయాలని అనుకుంది? ఎక్కడికి పారిపోవాలని ప్లాన్ చేసింది? వీటన్నింటికి సమాధానాలు ఇచ్చారు జగిత్యాల పోలీసులు.

Also Read..Korutla Deepthi Case : కోరుట్ల దీప్తి కేసు.. 70తులాల బంగారం తీసుకుని ప్రియుడితో పారిపోయేందుకు చందన మాస్టర్ ప్లాన్, చివరి నిమిషంలో ఊహించని దారుణం

ఇకపోతే.. ఈ కేసు వివరాలను వివరించిన జగిత్యాల జిల్లా ఎస్పీ.. మీడియాకు కీలక సూచన చేశారు. ఓ వీడియోకి సంబంధించి కీలక సమాచారం ఇచ్చారు. దీప్తి అనుమానాస్పద మృతి తర్వాత ఓ వీడియో వైరల్ అయ్యింది. చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ కోరుట్ల బస్టాండ్ లో ఉన్నట్లుగా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఉన్న వారిద్దరే అని ప్రచారం జరిగింది. ఈ వీడియో మీడియాలో సర్కులేట్ అయ్యింది.

అయితే, ఆ వీడియోలో ఉన్నది చందన కాదని తేల్చి చెప్పారు పోలీసులు. ఆ వీడియోని ఎవరూ షేర్ చేయొద్దని కోరారు. వాస్తవానికి ఆ వీడియోని పోలీసులు విడుదల చేయలేదని ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. కోరుట్ల బస్టాండ్ వీడియోను పోలీసులు విడుదల చేయలేదన్న ఎస్పీ.. ఆ వీడియోని షేర్ చేయొద్దని మీడియాను కోరారు. అందులో ఉన్నది ఎవరో తెలియదని, ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, వారి ప్రైవసీకి భంగం కలిగించొద్దని ఎస్పీ రిక్వెస్ట్ చేశారు.

ఇక, ఈ కేసులో బయటకు వచ్చిన ఆడియో సంభాషణ మాత్రం నిజమే అన్నారు ఎస్పీ భాస్కర్. ఆ వాయిస్ చందనదనే అని నిర్ధారించారు. కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళ్లాక తమను కవర్ చేసుకునేందుకు నిందితులంతా కలిసి చందనతో ఆ ఆడియో సంభాషణ పెట్టించారని చెప్పారు అక్కను నేను చంపలేదని క్రియేట్ చేసుకోవడం కోసం చందన ఆ ఆడియో రికార్డ్ చేసి సొంత తమ్ముడికి పంపిందన్నారు.

Also Read..Korutla Deepthi Case : కోరుట్ల దీప్తి మర్డర్ కేసులో ఐదుగురి అరెస్ట్, ఏ1-గా చెల్లెలు చందన, సంచలన విషయాలు చెప్పిన పోలీసులు

దీప్తి(24) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ఇంట్లో నుంచి పని చేస్తోంది. ఆమె చెల్లి చందన. బీటెక్ చదివే సమయంలో అదే కాలేజీలో చదువుతున్న ఉమర్ షేక్ సుల్తాన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. రెండేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు. అయితే, ఇంకా లైఫ్ లో సెటిల్ కానందున ఇప్పుడే పెళ్లి వద్దన్నాడు ఉమర్. తన దగ్గర డబ్బు, నగదు ఉందని దాంతో ఇద్దరం సెటిల్ అవుదామని చందన చెప్పింది. డబ్బు, నగదు కాజేసి ముంబై లేదా నాగ్ పూర్ వెళ్లి అక్కడ పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవ్వాలని చందన్, ఉమర్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఎలాంటి నేరం చేయకపోయినా దీప్తికి శిక్ష పడింది.

కాగా.. ప్రేమ కోసం చందన చేసిన పని అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ప్రేమించిన వాడితో పారిపోయేందుకు సొంత అక్కను కడతేర్చడం దారుణం అంటున్నారు. 20ఏళ్లు కలిసి పెరిగానే ఆలోచన మరిచి రెండేళ్ల ప్రేమ కోసం సొంత అక్కనే మట్టుబెట్టడం సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.