Korutla Deepthi Case : కోరుట్ల దీప్తి మర్డర్ కేసులో ఐదుగురి అరెస్ట్, ఏ1-గా చెల్లెలు చందన, సంచలన విషయాలు చెప్పిన పోలీసులు

ప్లాన్ లో భాగంగా చందన తన అక్క దీప్తికి వోడ్కా తెప్పించింది. ఇద్దరు కలిసి తాగారు. Korutla Deepthi Murder Case

Korutla Deepthi Case : కోరుట్ల దీప్తి మర్డర్ కేసులో ఐదుగురి అరెస్ట్, ఏ1-గా చెల్లెలు చందన, సంచలన విషయాలు చెప్పిన పోలీసులు

Korutla Deepthi Murder Case

Korutla Deepthi Murder Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన జగిత్యాల జిల్లా కోరుట్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దీప్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు చేధించారు. దీప్తిది మర్డర్ గా తేల్చారు. అంతేకాదు దీప్తిని చంపింది ఆమె చెల్లెలు చందనే అని నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఏ-1గా చందన..
ఈ కేసులో ఏ-1గా చందన (దీప్తి సొంత చెల్లి), ఏ-2గా ఉమర్ షేక్ సుల్తాన్ (అడ్డగుట్ట, ప్రగతి నగర్, హైదరాబాద్) (చందన లవర్), ఏ3-గా సయ్యద్ అలీ మహబూబ్ (ఉమర్ షేక్ సుల్తాన్ తల్లి), ఏ4-గా షేక్ అసియా ఫాతిమా(ఉమర్ షేక్ సుల్తాన్ చెల్లి), ఏ-5గా హఫీజ్ (ఉమర్ షేక్ ఫ్రెండ్) లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు బంగారు వడ్డానాలు, పెద్ద బంగారం హారం ఒకటి, పెద్ద బంగారు గాజుల-3, ఒక బంగారు కంకణం, చిన్న హారాలు, లక్ష రూపాయల క్యాష్, సెల్ ఫోన్, క్రైమ్ పడ్డ వాడిన చున్నీని(స్కార్ఫ్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (Korutla Deepthi Case)

Also Read..Deepthi Case: కోరుట్ల దీప్తిది హత్యేనని తేల్చేసిన పోలీసులు?

ప్లాన్ ప్రకారం అక్కకు వోడ్కా తెప్పించింది..
ఈ కేసు విచారణకు 5 బృందాలు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆర్మూర్-బాల్కొండ రూట్ లో నిందితులు పట్టుబడ్డారు. చందనకు సుల్తాన్ అనే ప్రేమికుడు ఉన్నాడు. గత నెల 19న కోరుట్లకు వచ్చిన సుల్తాన్ ను పెళ్లి చేసుకోవాలని చందన కోరింది. దాంతో ఆగస్టు 28న కోరుట్లకు వచ్చాడు సుల్తాన్. ప్లాన్ లో భాగంగా చందన తన అక్క దీప్తికి వోడ్కా తెప్పించింది. ఇద్దరు కలిసి తాగారు. దీప్తి మత్తులోకి జారుకున్నాక ఇంట్లో ఉన్న ఆభరణాలు, డబ్బుతో ఎస్కేప్ కావాలని చందన అనుకుంది.

సహజ మరణం అని నమ్మేలా సీన్ క్రియేట్ చేసిన చందన..
ఈ క్రమంలో ఇంట్లోని ఆభరణాలు తీసుకుంటూ ఉండగా సడెన్ గా దీప్తి లేచింది. చెల్లిని అరవడం స్టార్ట్ చేసింది. దాంతో చందన భయపడిపోయింది. తన విషయం బయటపడిపోతుందని కంగారుపడింది. వెంటనే స్కార్ప్ తో (చున్నీ) తన అక్క దీప్తి నోరు, ముక్కుని మూసేసింది. అప్పటికీ నోటి నుంచి సౌండ్ వస్తుండటంతో ఇంట్లో ఉన్న ప్లాస్టర్ ను చందన మూతికి వేసింది. 10 నిమిషాల తర్వాత దీప్తి చనిపోయింది. డబ్బు, నగలు బ్యాగ్ లోకి వేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయే ముందు దీప్తి నోటికున్న ప్లాస్టర్, స్కార్ప్ తీసేసింది చందన. దీప్తి వోడ్కా తాగి చనిపోయింది, ఆమె సహజ మరణం అని సీన్ క్రియేట్ చేసింది చందన.

అక్కను చంపాలని అనుకోలేదు..
ఈ కేసులో బంగారంతో పాటు నగదును రికవరీ చేసినట్లు జగిత్యాల ఎస్పీ భాస్కర్ వెల్లడించారు. వాస్తవానికి చందనకు తన అక్క దీప్తిని చంపాలని ప్లాన్ లేదన్నారు పోలీసులు. దీప్తికి మందు తాగించి ఆమె నిద్రలో మునిగిన తర్వాత డబ్బు, నగలతో ఎస్కేప్ అవ్వాలని అనుకుంది. అయితే దీప్తి లేచి అరవడంతో చందన దారుణానికి ఒడిగట్టిందన్నారు.

సడెన్ గా నిద్రలేచిన దీప్తి..
”దీప్తిని ఆమె సొంత చెల్లి చందన చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించాము. తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లడంతో తన బాయ్ ఫ్రెండ్ ఉమర్ ను చందన అర్థరాత్రి ఇంటికి పిలిచింది. అంతకుముందే అక్క దీప్తికి వోడ్కా తాగించింది. ఉమర్, చందన డబ్బులు, బంగారు ఆభరణాలు తీసుకుంటూ ఉండగా.. దీప్తి సడెన్ గా లేచి అరిచింది. దీంతో భయపడిపోయిన చందన తన బాయ్ ఫ్రెండ్ సాయంతో.. స్కార్ప్ (చున్నీ), ప్లాస్టర్ వేసి దీప్తిని బిగించింది. దీప్తి ముక్కు, నోరు కవర్ అయ్యే విధంగా, ముఖ్యంగా అరవకుండా ఉండేలా స్కార్ప్ తో బిగించారు. దాంతో దీప్తి సోఫా మీద పడిపోయింది. వెంటనే ఉమర్, చందన కలిసి.. మరో స్కార్ప్ తో చందన చేతులు కట్టేశారు.

సహజ మరణం అని నమ్మించేలా సీన్ క్రియేట్..
మూతికి స్కార్ప్ బిగించినా ఇంకా అరుపులు వస్తున్నాయని చెప్పి ఇంట్లో ఉన్న ప్లాస్టర్ ను దీప్తి మూతికి వేసింది చందన. అలా 10 నిమిషాలు గడిచాయి. ఆ తర్వాత దీప్తిలో చలనం లేకుండా పోయింది. దీప్తి చనిపోయాక బంగారం, డబ్బు తీసుకుని చందన తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది. లక్ష 20వేల రూపాయల క్యాష్, 70 తులాల గోల్డ్ బ్యాగులో వేసుకుని ఎస్కేప్ అయ్యారు. వెళ్లిపోవడానికి ముందు దీప్తి మూతికి ఉన్న ప్లాస్టర్, స్కార్ప్ అన్నీ తీసేశారు. దీప్తిది సహజ మరణం అని నమ్మించేలా, వోడ్కా తాగి చనిపోయిందనేలా సీన్ క్రియేట్ చేసింది చందన.

ఉదయం 5గంటల ప్రాంతంలో చందన, ఉమర్ కారులో హైదరాబాద్ వెళ్లారు. డబ్బుతో నగలతో ముంబై కానీ, నాగ్ పూర్ కానీ వెళ్లిపోవాలని అక్కడే పెళ్లి చేసుకుని ఉండాలని చందన, ఉమర్ ప్లాన్ చేశారు. ఉమర్ కు ఆమె తల్లి, చెల్లి, బంధువు సహకరించారు” అని జగిత్యాల ఎస్పీ భాస్కర్ కేసు వివరాలను వెల్లడించారు.