×
Ad

Telangana : మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని .. వాతావరణ శాఖ తెలిపింది.

  • Published On : November 3, 2021 / 11:34 AM IST

Red Alert In Telangana Over Heavy Rains

Telangana Rain : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని .. వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొమరీన్‌ ప్రాంతంపై అల్పపీడనం ఏర్పడిందని.. దీని నుంచి తమిళనాడు తీరం వరకూ గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించిందని చెప్పింది. వీటి ప్రభావంతో 2021, నవంబర్ 03వ తేదీ బుధశారం తెలంగాణలో అక్కడక్కడ భారీగా, గురువారం నుంచి 3 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది.

Read More : India Covid – 19 : భారత్‌‌లో కరోనా..కొత్తగా ఎన్ని కేసులంటే

తెలంగాణలో మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 109 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. జనగామ జిల్లా కోలుకొండలో అత్యధికంగా 7.1 సెం.మీల వర్షపాతం నమోదు కాగా.. జఫర్‌గఢ్‌లో 5.2, పాలకుర్తిలో 4.3, వర్ధన్నపేటలో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రత సాధారణంకన్నా 3 డిగ్రీల వరకూ అదనంగా  పెరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా అర్లిలో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.