India Covid – 19 : భారత్‌‌లో కరోనా..కొత్తగా ఎన్ని కేసులంటే

దేశంలో 11 వేల 903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 311 మరణాలు నమోదయ్యాయి.

India Covid – 19 : భారత్‌‌లో కరోనా..కొత్తగా ఎన్ని కేసులంటే

India Covid

India Covid Cases : భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతున్నాయి. తాజాగా..దేశంలో 11 వేల 903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 311 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో లక్షా 51 వేల 209 యాక్టివ్ కేసులున్నాయి.

Read More : Major Movie : ‘మేజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరోసారి అదరగొట్టబోతున్న అడవిశేష్..

0.44 శాతంగా ఉన్న యాక్టివ్ కేసులు ఇప్పటి వరకు 34, 30, 81, 40 కేసులున్నాయి. కరోనా రికవరి 98.22 శాతంగా ఉంది. 24 గంటల్లో కరోనా నుంచి 14 వేల 159 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,36,97,740 చేరుకుంది. దేశంలో మార్చి 2020 తర్వాత..భారీగా రికవరీ కేసులు నమోదయ్యాయి.

Read More : Delhi Air Quality : ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం.. ‘వెరీ పూర్’ ఇదే ఫస్ట్ టైం!

మరోవైపు..కరోనా వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా 107.29 కోట్ల డోసులు పంపిణీ చేశారు. 24 గంటల్లో 41,16,230 డోసులు టీకాలు అందచేశారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా…107,29,66,315 డోసుల టీకాలను ప్రజలకు వేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.