Hyderabad Rains
Telangana: తెలంగాణ వ్యాప్తంగా మరో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం 08గంటల 30నిమిషాలకు తెలిపిన వాతావరణ విశ్లేషణ ఆధారంగా గాలివిచ్చిన్నతి/ఉపరితలద్రోణి విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం మొత్తం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. 6, 7, 8 తేదీలలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధ, గురు వారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో(గాలి వేగం గంటకు 30 నుండి 50 కి మీ వేగంతో) కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read Also: తెలంగాణలో అకాల వర్షం.. అన్నదాత విలవిల..
ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు వివరించారు.