×
Ad

Kismatpur : మత్తులో తూలుతున్న యువతిపై.. ఇద్దరు కాదు.. ముగ్గురు ఆటో డ్రైవర్లు దారుణం.. కిస్మత్‌పూర్ బ్రిడ్జి వద్ద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి..

Kismatpur Gang Rape హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్‌పూర్ బ్రిడ్జి వద్ద యువతి మృతి ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

Kismatpur Gang Rape

Kismatpur Gang Rape : హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కిస్మత్ పూర్ బ్రిడ్జి వద్ద ఈనెల 15వ తేదీన యువతి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్లుతాగి మత్తులో తూలుతూ వెళ్తున్న యువతిపై ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేసి వదిలేయగా.. మరో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆమెపై లైంగిక దాడి చేయడంతోపాటు దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Also Read: Dowry Dispute: ఎంతకు తెగించార్రా..! పాపం.. అదనపు కట్నంకోసం కోడలిని గదిలో వేసి పామును వదిలారు.. చివరిలో బిగ్ ట్విస్ట్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న 32ఏళ్ల యువతి ఈనెల 14వ తేదీన పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 143 వద్ద మత్తులో తూలుతూ వెళ్తుంది. లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మేకా దుర్గారెడ్డి.. బీరు, బిర్యానీ ఇప్పిస్తానని ప్రలోభపెట్టి ఆటోలో ఎక్కించుకున్నాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మత్తులో ఉన్న ఆమెపై లైంగికదాడి చేశాడు. ఆ తరువాత ఆరాంఘర్ వద్ద ఫంక్షన్ హాల్ సమీపంలో వదిలి వెళ్లిపోయాడు.

ఆరాంఘర్ వద్ద తూలుతూ వెళ్తున్న యువతిని టోలీచౌకీ హకీంపేట్‌కు చెందిన ఆటో డ్రైవర్ గులాం దస్తగిరి ఖాన్ చూశాడు. మరో ఆటో డ్రైవర్ మొహమ్మద్ ఇమ్రాన్‌కు ఫోన్ చేసి చెప్పడంతో అతడు కూడా అక్కడకు వచ్చాడు. మద్యం మత్తులో తూలుతూ వెళ్తున్న మహిళలను దస్తగిరి బలవంతంగా ఆటోకి లాగాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఆ యువతిని కిస్మత్ పూర్ మూసీ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తరువాత వెదురు బొంగులతో దారుణంగా కొట్టి చంపేశారు.

రెండు రోజుల తరువాత యువతి మృతదేహంను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటకొచ్చింది.

సీసీటీవీ పుటేజీల ఆధారంగా పోలీసులు కేసును ఛేధించారు. మహిళ చనిపోయిన చోట ఒక ప్లాస్టిక్ కవర్లో, చిన్న డిస్పోజబుల్ డబ్బాలో కల్లు కనిపించింది. హత్యజరిగిన స్థలం నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్న కల్లు కంపౌండ్ వద్దకు వెళ్లిన పోలీసులు.. అక్కడి సీసీ పుటేజీలను పరిశీలించారు. ఆ పక్కనే ఉన్న పలు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక ఆటో కల్లు కంపౌండ్ నుంచి వెళ్లడం గుర్తించారు. ఆటో వెనక ఒక పువ్వు గుర్తును గమనించి.. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా ఆ ఆటో గోల్కొండకు చెందిన ఓ వ్యక్తిదిగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆటో నాదే.. కానీ, అద్దెకు తిప్పుతున్నానని తెలిపాడు. దీంతో ఆ రోజు ఆటోను అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎవరో వివరాలు తెలుసుకున్నారు. దీంతో నిందితుడిని పట్టుకొని విచారించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. కిడ్నాప్,గ్యాంగ్ రేప్, లైంగిక దాడి, హత్య అభియోగాలతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.