Telangana : తాండూరు TRSలో ఆధిపత్య పోరు ..కేటీఆర్ మాట లెక్క చేయని నేతలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్‌లో లుకలుకలు మొదలయ్యాయ్. నేతల మధ్య గ్యాప్ పెరుగుతోంది. తాండూరు నియోజకవర్గంలో.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్య మరోసారి అగ్గి రాజుకుంది.

Tandoor Trs Mlc And Mla..patnam Mahender Reddy, Sitting Mlc Pilot Rohit Reddy,..

Tandoor TRS MlC and MLA..disputes : ఇప్పుడున్న ఎమ్మెల్సీ.. ఒకప్పుడు అక్కడి ఎమ్మెల్యే. అక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే.. ఒకప్పుడు ఈ ఎమ్మెల్సీకి ప్రత్యర్థి. ఇప్పుడు.. వీళ్లిద్దరూ అధికార పార్టీలోనే ఉన్నారు. ఆ నియోజకవర్గం మీదే ఆశలు పెట్టుకున్నారు. అయితే.. అధిష్టానం ఎవరికి చాన్స్ ఇస్తుందో.. ఇప్పుడే తెలియకపోయినా.. ఆ ఎమ్మెల్సీ మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోయేది తానేనని.. చెప్పుకుంటున్నారు. ఇది.. ఎమ్మెల్యేకు నచ్చడం లేదు. దీనిపై.. హైకమాండ్‌కు కంప్లైంట్ కూడా వెళ్లింది. అగ్ర నాయకత్వం మందలించినా.. ప్రయోజనం లేకపోయింది. చివరికి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట కూడా.. ఆ ఎమ్మెల్సీ లెక్క చేయడం లేదా?

Also read : BJP Leader Vivek: పీకేను తెచ్చుకొని కేసీఆర్‌ ఓటమిని ముందే ఒప్పుకుండు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్‌లో లుకలుకలు మొదలయ్యాయ్. నేతల మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో వాళ్లు చేస్తున్న కామెంట్స్ కూడా కాంట్రవర్శీకి దారితీస్తున్నాయ్. తాండూరు నియోజకవర్గంలో.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మధ్య మరోసారి అగ్గి రాజుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణమనే ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో.. తాండూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని.. పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరులో తాను పనిచేసుకుంటుండగానే.. ఎమ్మెల్సీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. పార్టీ శ్రేణులు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని.. అధిష్టానానికి కంప్లైంట్ చేసినట్లు సమాచారం.

ఇక.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య సఖ్యత కుదరక.. తాండూరు టీఆర్ఎస్‌లోని రెండు వర్గాల నాయకుల మధ్య మధ్య ఘర్షణలు, దాడులు కూడా చోటు చేసుకున్నాయ్. దీంతో.. అధిష్టానం పిలిచి మందలించినా.. ఇద్దరిలో ఎలాంటి మార్పు రావడం లేదని.. సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది. అయితే.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేసిన కామెంట్స్‌ని కూడా కొట్టి పారేయడానికి వీల్లేదని.. జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. అన్ని రకాలుగా బలంగా ఉన్న వ్యక్తి కావడంతో.. మరో ఆలోచనే అవసరం లేదని.. మహేందర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు.

Also read : Asthma Medicines : కోవిడ్‌కు ఆస్తమా చికిత్సలో ఉపయోగించే మందు

మరోవైపు.. టీఆర్ఎస్‌లోని అసంతృప్త నేతలను గుర్తించి.. వారికి టచ్‌లోకి వెళ్తున్నాయ్.. రాష్ట్రంలోని జాతీయ పార్టీలు. అసంతృప్త నాయకులను ఆకర్షించేందుకు.. భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆ రెండు జాతీయ పార్టీల నుంచి వచ్చిన ఆఫర్లను దృష్టిలో ఉంచుకొనే.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉంటాననే కామెంట్స్ చేసి ఉంటారా? అనేది.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కాకపోతే.. టీఆర్ఎస్ అధిష్టానమే.. ఆయనకు లోలోపల బంపర్ ఆఫరేమైనా ప్రకటించిందా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్.

గత ఎన్నికల్లో తాండూరులో పోటీ చేసిన ఓడిపోయారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఆయనపై పోటీ చేసిన గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి.. తర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. రోహిత్ చేరికను.. అప్పుడే మహేందర్ రెడ్డి వ్యతిరేకించారు. అదే టైంలో.. టీఆర్ఎస్ అధిష్టానం ఆయన్ని బుజ్జగించింది. తర్వాత కొన్నాళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. రోజురోజుకు.. వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో మార్పులు చోటు చేసుకుంటుండటంతో.. మహేందర్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఏదేమైనా.. తాండూరు టీఆర్ఎస్‌లో మళ్లీ ఆధిపత్య పోరుని.. కింది స్థాయి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.