Asthma Medicines : కోవిడ్‌కు ఆస్తమా చికిత్సలో ఉపయోగించే మందు

ఈ ఔషధం Nsp1 అని పిలువబడే SARS-CoV-2 ప్రొటీన్‌ ద్వారా కట్టడి చేస్తుందని IISCలోని పరిశోధకులు వెల్లడించారు. ఇది మానవ కణాల లోపల విడుదలైన మొదటి వైరల్ ప్రోటీన్‌లలో ఒకటని వివరించారు.

Asthma Medicines : కోవిడ్‌కు ఆస్తమా చికిత్సలో ఉపయోగించే మందు

Covid (1)

drug for Covid : కరోనాకు ఇప్పటికే అనేక రకాల ఔషదాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కోవిడ్‌కు వాడే ఔషదంపై నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు. ఆస్తమా కోసం ఉపయోగించే మందులు…కోవిడ్‌లోని సార్స్‌-కోవ్‌-2, కోవిడ్‌-19కి కారణమయ్యే వైరస్‌పై పనిచేస్తుందని తెలిపారు. రోగనిరోధక కణాలలో వైరస్‌ను అడ్డుకుటుందోని చెబుతున్నారు. ఉబ్బసం, జ్వరం, దద్దుర్లు వంటి పరిస్థితుల వల్ల కలిగే మంటను తగ్గించడానికి మాంటెలుకాస్ట్ ఉపయోగిస్తారు. అయితే ఇది కోవిడ్-19కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు.

ఈ ఔషధం Nsp1 అని పిలువబడే SARS-CoV-2 ప్రొటీన్‌ ద్వారా కట్టడి చేస్తుందని IISCలోని పరిశోధకులు వెల్లడించారు. ఇది మానవ కణాల లోపల విడుదలైన మొదటి వైరల్ ప్రోటీన్‌లలో ఒకటని వివరించారు. ఇది శరీరంలో వైరస్‌ను అడ్డుకుంటుందని చెప్తున్నారు. SARS-CoV-2 ఇన్‌ఫెక్షన్‌ను ఎదుర్కోవడానికి మాంటెలుకాస్ట్ సోడియం హైడ్రేట్ ప్రధాన అణువుగా ఉపయోగపడుతుందని శాస్త్రవెత్తలు చెప్తున్నారు.

Monoclonal Antibodies : కరోనా రోగులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త చికిత్స, వారంలో కోలుకుంటారు

ఈ ప్రోటీన్‌లో, ముఖ్యంగా సి-టెర్మినల్ ప్రాంతంలో మ్యుటేషన్ రేటు మిగిలిన వాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉందని వివరించారు. వైరల్ ప్రొటీన్, Nsp1 ఉద్భవించే వైరస్ ఏవైనా రకాల్లో పెద్దగా మారకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. కోవిడ్-19 రోగులలో మాంటెలుకాస్ట్ ఆసుపత్రిలో చేరడాన్ని తగ్గించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.