Hyderabad
Hyderabad : నగరంలోని మాదాపూర్‌లో శనివారం సాయంత్రం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు.
Read More : నిశ్చితార్ధం జరిగింది…త్వరలో పెళ్లి…. ఇంతలోనే….!
ఇక ప్రమాదం అనంతరం కారు నడిపిన వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తి విద్యుత్ శాఖలో డీఈగా పనిచేస్తున్న నరేందర్ రెడ్డిగా గుర్తించారు.
Read More : నడుస్తున్న ప్రభాస్ జమానా.. వందలకోట్ల రెమ్యూనరేషన్?