Ration Card: కొత్త రేషన్ కార్డులు అందుకున్న వారికి గుడ్‌న్యూస్.. నేరుగా రేషన్ దుకాణాలకు వెళ్లి..

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు (Ration Card) లు అందుకున్న వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి సెప్టెంబర్ నెల నుంచి..

Ration Card

Ration Card: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికి రేషన్ కార్డు (Ration Card)లు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసిన ప్రభుత్వం.. వారికి తాజాగా.. మరో గుడ్ న్యూస్ చెప్పింది. (Ration Card)

Also Read: GST Slab: జీఎస్టీలో కీలక మార్పులు.. సబ్బులు నుంచి ఫోన్లు, ఏసీలు, రెడీ‌మేడ్ దుస్తులు వరకు.. ధర భారీగా తగ్గే వస్తువుల జాబితా ఇదే..

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జూన్ నెలలో ఒకేసారి మూడు నెలలకు సంబంధించి రేషన్ కోటా బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ దుకాణాలు మూసివేశారు. సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

దీంతో సెప్టెంబర్ నెల కోటా సన్నబియ్యాన్ని రాష్ట్ర స్థాయి గోదాములు (స్టేజ్-1) నుంచి మండల లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లను పౌరసరఫరాల సంస్థ పర్యవేక్షిస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జులై, ఆగస్టు నెలల్లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది. అయితే, వారికి రెండు నెలలుగా రేషన్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. సెప్టెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు అందుకున్న వారికి కూడా రేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం.

కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారందరికీ సెప్టెంబర్ నెలలో సన్నబియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఈసారి లబ్ధిదారులకు బియ్యంతోపాటు చేతి సంచిని (బ్యాగ్) అందజేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి యథావిధిగా ప్రజాపంపిణీ కేంద్రాల (రేషన్ దుకాణాలు) ద్వారా సన్నబియ్యంను సరఫరా చేయనున్నారు. దీంతో కొత్తగా రేషన్ కార్డు అందుకున్నవారు నేరుగా రేషన్ దుకాణాలకు వెళ్లి రేషన్ ను తీసుకోవచ్చునని అధికారులు చెప్పారు.