రవి ప్రకాశ్ కస్టడీ పిటిషన్ వాయిదా

టీవీ9 మాజీ సీఈవో కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. దీని గురించి రేపు తీర్పు రానుంది. బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. టీవీ9కు తెలియకుండా రూ.18కోట్ల మోసం గురించి పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. టీవీ9 యాజమాన్యానికి తెలియకుండా లావాదేవీలు ఎలా జరిపాడని వాదనలు వినిపించాయి.
మరోవైపు ధర్మాసుపత్రి పేరుతో రవిప్రకాశ్ అండ్ కో చేసిన అక్రమాలను 10TV బయటపెట్టడంతో ప్రభుత్వం కదలింది. అటు ఆర్డీవో ఇటు ఇంటెలిజెన్స్ రెండూ రంగంలోకి దిగాయి. రవిప్రకాశ్ సిలికానాంధ్ర ఆసుపత్రి వ్యవహారం కలకలం రేపడంతో ప్రభుత్వం స్పందించింది. కూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి విషయంలో అసలేం జరిగిందో తేల్చాలని కలెక్టర్‌ను ఆదేశించింది.
ధర్మాసుపత్రి అయినప్పటికీ పేదల నుంచి వైద్యానికి డబ్బులు వసూలు చేయడంపై కూడా ఆర్డీవో దృష్టిపెట్టనున్నారు. ఆస్పత్రి ప్రారంభమై ఏడాది దాటిపోయినా ఇన్‌పేషెంట్ విభాగం ఎందుకు అందుబాటులోకి రాలేదు. అంబులెన్సులు ఎందుకు కొనలేదు..? అని కూడా విచారించనున్నారు. రవిప్రకాశ్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి విరాళాలు, మోసాలను బయటపెట్టాలని, తామిచ్చిన విరాళాలు ఏమయ్యాయో తేల్చాలని కూచిపూడి వాసులు డిమాండ్ చేస్తున్నారు.