Ready mix container Accident
ReadyMixed Container Accident in Mushirabad : హైదరాబాద్ లో రెడీమిక్స్ కంటైనర్ వాహనం బీభత్సం సృష్టించింది. ముషీరాబాద్ చౌరస్తాలో పార్క్ చేసిన వాహనాలపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముషీరాబాద్ పోలీస్ వాహనంతోపాటు మూడు డీసీఎం వాహనాలు, ఒక టాటా ఏసీ, ఒక ద్విచక్ర వావాహనం ద్వంసమయ్యాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ యూసఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Air plane crash: వామ్మో ఘోర విమాన ప్రమాదాలు.. ఈ నెలలో ఎక్కడెక్కడ, ఎన్ని జరిగాయో తెలుసా?
రెడీమిక్స్ కంటైనర్ వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, కంటైనర్ వాహనం బీభత్సం నుంచి తృటిలో పోలీస్ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం అర్థరాత్రి 2.30 గంటల సమయంలో స్థానిక ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ముషీరాబాద్ చౌరస్తా వద్దకు రాగానే రెడీమిక్స్ కంటైనర్ వాహనం అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఆ తరువాత పోలీస్ వాహనం వైపు దూసుకెళ్లింది. దీంతో అక్కడే వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పక్కకు పరుగులు తీశారు. దీంతో తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Also Raed: Telangana DGP: జీరో శాతం డ్రగ్స్ రాష్ట్రంగా నిలపడమే పోలీస్ శాఖ లక్ష్యం : డీజీపీ జితేందర్
రెడిమిక్స్ కంటైనర్ వాహనం డ్రైవర్ యూసఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రమాదానికి నిద్రమత్తే కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి చిలకలగూడ పోలీసులు యూసఫ్ ను స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే, ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది.