తెలంగాణ అభివృద్ధికి ప్రధాన కారణం శాంతిభద్రతలే

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పథంలో పురోగమిస్తోందని, దీనికి ప్రధాన కారణం శాంతిభద్రతలేనని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రవీంద్రభారతీలో జరిగిన పోలీస్

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 02:11 AM IST
తెలంగాణ అభివృద్ధికి ప్రధాన కారణం శాంతిభద్రతలే

Updated On : January 9, 2020 / 2:11 AM IST

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పథంలో పురోగమిస్తోందని, దీనికి ప్రధాన కారణం శాంతిభద్రతలేనని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రవీంద్రభారతీలో జరిగిన పోలీస్

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పథంలో పురోగమిస్తోందని, దీనికి ప్రధాన కారణం శాంతిభద్రతలేనని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. తెలంగాణ.. దేశానికి ఆదర్శంగా నిలవడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పెట్టుబడిదారులు ముందుగా ఆయా రాష్ట్రాల్లోని శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షిస్తారన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉంటుందని.. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

రవీంద్రభారతిలో జరిగిన పోలీస్ మెడల్స్ ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి.. వివిధ హోదాల్లో విశిష్ట సేవలు అందించిన 418 మంది పోలీసులకు మెడల్స్ అందజేశారు. పోలీసు శాఖకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని హోంమంత్రి గుర్తు చేశారు. పోలీస్ శాఖకు ఎన్నడూ లేనంత నిధులను కేటాయించారన్నారు. ఆధునిక, సాంకేతిక పద్దతుల వినియోగం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో తెలంగాణా పోలీసులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని మంత్రి కితాబిచ్చారు. పోలీసు వృత్తి కత్తిమీద సాము లాంటిదని.. ఎన్నో త్యాగాలు చేస్తే గానీ ఉత్తమ సేవా పురస్కారాలు అందుకోవడం సాధ్యం కాదని హోంమంత్రి అన్నారు. 

హరితహారం, పల్లె ప్రగతిలో పోలీసు అధికారులు చురుగ్గా పాల్గొన్నారని మంత్రి ప్రశంసించారు. నగరంలో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభమైతే శాంతి భద్రతలను మరింత అద్భుతంగా పర్యవేక్షించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పతకాలు అందుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని డీజీపీ మహేందర్‌ రెడ్డి అభినందించారు. ఈ పురస్కారాలతో మరింత ఉత్సాహంగా సేవలను అందించాలని వారికి డీజీపీ సూచించారు. పెద్ద ఎత్తున ఇంత మంది రాష్ట్ర పోలీసులు పతకాలు సాధించడం ఇదే మొదటిసారని.. తనకు ఎంతో గర్వంగా ఉందని డీజీపీ అన్నారు. 

* శాంతిభద్రత వల్లే తెలంగాణ అభివృద్ధి-హోంమంత్రి మహమూద్ అలీ
* రవీంద్రభారతీలో పోలీస్ మెడల్స్ ప్రదానోత్సవం
* 418 మంది పోలీసులకు మెడల్స్ అందజేసిన హోంమంత్రి
* ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో తెలంగాణ పోలీసులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని కితాబు