Hydra Commissioner : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు బిగ్ రిలీఫ్..
Hydra Commissioner AV Ranganath : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
Hydra Commissioner AV Ranganath
Hydra Commissioner AV Ranganath : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. హైదరాబాద్ నగర పరిధిలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి హైడ్రా తీసుకుంటున్న చర్యలపై గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్‌లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ విచారణ సందర్భంగా నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నారని.. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలని హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ దేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయగా.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తొలగింపు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
