renuka chowdhury: మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారు: రేణుకా చౌదరి

తెలంగాణలో ప్రోటోకాల్ అమలు కావడం లేదని, గవర్నర్ పర్యటనకు కూడా సెక్యూరిటీ కల్పించడం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు.

khammam: తెలంగాణలో ప్రోటోకాల్ అమలు కావడం లేదని, గవర్నర్ పర్యటనకు కూడా సెక్యూరిటీ కల్పించడం లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. రాష్ట్రంలో మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నారని ఆమె విమర్శించారు. మరోవైపు బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిందితుడిగా ఉన్నప్పటికీ ఎందుకు అరెస్టు చేయడం లేదని రేణుకా చౌదరి ప్రశ్నించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన గవర్నర్ హోదాను అవమానపరుస్తున్నారని, టీఆర్ఎస్ పాలనా విధానం ఇదేనా అని ఆమె విమర్శించారు.

Revanth Reddy: “రేవంత్ ఫెయిర్ గేమ్ ఆడటం లేదు.. సస్పెండ్ చేస్తే సత్తా చూపిస్తా”

‘‘నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు గవర్నర్‌ వెళ్తే కనీసం సెక్యూరిటీ కల్పించరా? ఐఏఎస్, ఐపీఎస్‌లకు రాజకీయాలతో ఏం సంబంధం? గవర్నర్ పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం అధికారులు హాజరు కావాలి. అయినా ఎందుకు రాలేదు? గవర్నర్ మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఇవి సంస్కారం ఉన్న వాళ్లు చేసే పనులు కావు. ఏ మహిళ గురించి, ఎవరు విమర్శలు చేసినా ఊరుకోము’’ అంటూ గవర్నర్ విషయంలో టీఆర్ఎస్‌ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్‌పై చర్యలు తీసుకోకపోవడానికి కేటీఆరే కారణమని ఆమె అన్నారు.

Khammam : ప్రియుడి పెళ్లిని అడ్డుకున్న యువతిపై మహిళల దాడి

‘‘బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో పువ్వాడ అజయ్ ఏ1 నిందితుడు. అయినా అతడిపై చర్యలు తీసుకోవడం లేదు. మంత్రి పువ్వాడకు, కేటీఆర్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అందుకే పువ్వాడపై ఎలాంటి చర్యలు లేవు. పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంటే ఏసీపీకి సంబంధం లేదా? ఈ కేసులో ఏసీపీ కూడా నిందితుడే. ఏసీపీపై చర్యలు తీసుకోవాలి. ఏసీపీ తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. ఖమ్మంలో బీజేపీ నేతలతోపాటు, కాంగ్రెస్ నాయకులపై అక్రమంగా పీడీ కేసులు పెట్టి వేధిస్తున్నారు. చివరకు కోర్టు ఆదేశాలిచ్చినా అమలు కావడం లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని, నిందితులపై కేసులు పెట్టేలా చూడాలి. బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకున్నా కూడా పట్టించుకోకపోతే ఎలా’’ అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.

Telangana Governor : గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు.. అనవసరంగా విమర్శిస్తున్నారు

కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ ఖమ్మం రాకుండా ఎవరూ అడ్డుకోలేరు. నేనే దగ్గరుండి తీసుకెళ్తా. రేవంత్ కోసం ఖమ్మం ఎదురు చూస్తోంది. భట్టి తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన పాదయాత్రకు నన్ను ఆహ్వానించలేదు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇప్పటివరకు నన్న కలవలేదు. పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం. ప్రశాంత్ కిషోర్ అంశం అధిష్టానం చూసుకుంటుంది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ అంత ఆసక్తిగా లేదు. టీఆర్ఎస్‌తో కలిసి పనిచేసేందుకు మా కార్యకర్తలు సిద్ధంగా లేరు. టీఆర్ఎస్ మాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’’ అని రేణుక అభిప్రాయపడ్డారు. మరోవైపు కమ్మకులాన్ని కొందరు అణచివేయాలని చూస్తున్నారని, ఏపీ రాజధానిని అమరావతి కాదు.. కమ్మరావతి అని ఒక సీఎం అన్నాడని.. దమ్ముంటే ఆ పేరు పెట్టి చూడాలని ఆమె సవాల్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు