Revanth Reddy: “రేవంత్ ఫెయిర్ గేమ్ ఆడటం లేదు.. సస్పెండ్ చేస్తే సత్తా చూపిస్తా”

కాంగ్రెస్ సీనియర్ నేతల మీటింగ్‌పై హై కమాండ్ సీరియస్ అయినా.. తగ్గేదేలేదనే వైఖరి చూపిస్తున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి వ్యతిరేక స్వరం వినిపిస్తూ భేటీ అయ్యారు.

Revanth Reddy: “రేవంత్ ఫెయిర్ గేమ్ ఆడటం లేదు.. సస్పెండ్ చేస్తే సత్తా చూపిస్తా”

Revanth Reddy

Revanth Reddy: కాంగ్రెస్ సీనియర్ నేతల మీటింగ్‌పై హై కమాండ్ సీరియస్ అయినా.. తగ్గేదేలేదనే వైఖరి చూపిస్తున్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి వ్యతిరేక స్వరం వినిపిస్తూ భేటీ అయ్యారు. సవాళ్లు విసురుతూ.. తమ తడాఖా చూపిస్తామని, రాష్ట్రంగా తిరుగుతామని మొత్తం రేవంత్ వైఖరినే ప్రెస్ మీట్‌లో ఎండగడుతూ వ్యాఖ్యలు చేశారు.

జగ్గారెడ్డి వ్యాఖ్యలు:
‘రేవంత్ ఫెయిర్ గేమ్ ఆడటం లేదు. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే గేమ్ ఆడుతుండు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా. అతనికి దమ్ముంటే కాంగ్రెస్ తరపున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలి. అందుకే మేం ఇన్ డైరెక్ట్ గేమ్ మొదలు పెట్టాం. ప్రత్యేక సమావేశం పెడితే.. షోకాజ్ నోటీస్ ఇస్తామని బెదిరిస్తున్నారు. నాకు నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేస్తే సత్తా చూపిస్తా. రాష్ట్రం అంతా తిరుగుతా’

‘ఒకవేళ అంత క్రేజ్ ఉంటే హుజురాబాద్ లో మూడు వేలే ఎందుకు వస్తాయి. కాంగ్రెస్ లో కొందరు రేవంత్ భజనపరులు జమ అయ్యారు. సంగారెడ్డిలో రాజీనామా చేస్తే అక్కడ నాపై రేవంత్ అభ్యర్థిని పెట్టి గెలిపిస్తే హీరో అని ఒప్పుకుంటా. ‘సస్పెండ్ చేసినా మేం రాహుల్, సోనియా గాంధీలకు విధేయులుగానే ఉంటాం. వారి నాయకత్వాన్ని బలపరుస్తాం’

Read Also: రేవంత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ల ఢిల్లీ పయనం ?

‘నన్ను సస్పెండ్ చేస్తే, రోజుకో బండారం బయటపెడతా. రేవంత్ పార్టీ లైన్‌లో పని చేయడం లేదు. రేవంత్ పర్సనల్ షో మాత్రమే చేస్తున్నారు. అందుకే నేను కూడా పర్సనల్ షో చేస్తున్నా. తన కూతురు సమస్య పై వీహెచ్ మంత్రి హరీష్ రావును కలిస్తే తప్పేంటి’ అని ప్రశ్నించారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ..
‘పార్టీలో తనకు జరుగుతున్న ఇబ్బందులు జగ్గారెడ్డి మాకు చెప్పారు. రేవంత్ రెడ్డి బయట ఒకటి.. లోపల మరో విధంగా ప్రవర్తిస్తున్నాడని జగ్గారెడ్డి మాకు చెప్పారు. సోమవారం వీహెచ్, మర్రి శశిధర్ రెడ్డితో కూడా మాట్లాడుతాం. రేవంత్‌పై జగ్గారెడ్డి చేసిన సవాల్‌పై నేనెలాంటి కామెంట్స్ చేయదలుచుకోలేదు’ అని వివరించారు దయాకర్.