Khammam : ప్రియుడి పెళ్లిని అడ్డుకున్న యువతిపై మహిళల దాడి

ప్రేమించిన ప్రియుడు మోసం చేసి... మరో పెళ్లి చేసుకుంటుంటే అడ్డుకున్న ప్రియురాలిని అతడి బంధువులు దారుణంగా కొట్టారు. ఇందతా చూస్తున్న కానిస్టేబుల్ కనీసం అటువైపు కన్నెత్తికూడా చూడలేదు

Khammam : ప్రియుడి పెళ్లిని అడ్డుకున్న యువతిపై మహిళల దాడి

Khammam

Khammam :  ప్రేమించిన ప్రియుడు మోసం చేసి… మరో పెళ్లి చేసుకుంటుంటే అడ్డుకున్న ప్రియురాలిని అతడి బంధువులు దారుణంగా కొట్టారు. ఇందతా చూస్తున్న కానిస్టేబుల్ కనీసం అటువైపు కన్నెత్తికూడా చూడలేదు.ఖమ్మంవలో ఖాకీ సాక్షిగా ఓ ఆడపిల్లపై జరిగిన అమానుష దాడిలో గాయపడింది ఆ యువతి. వివరాలలోకి వెళితే….తల్లిదండ్రులు లేని అమ్మాయిపై వలపు వల విసిరాడు. రెండేళ్లు వెంటపడి ఆమె ప్రేమను పొందాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేశాడు. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. తనను మోసం చేయొద్దని వేడుకున్న యువతిపై బంధువులతో దాడి చేయించాడు.

ఖమ్మంలో తనను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న వరుడిని నిలదీసేందుకు వెళ్లిన యువతిపై బంధువులు దాడి చేశారు. పెళ్లి మండపం నుంచి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బయట పడేశారు. పోలీసులు పక్కనే ఉన్నా అడ్డుకోలేదు సరికాదు మాట కూడా మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రేమించినంతకాలం తనంత బాగా చూసుకునవారు లేరన్నట్టు బిల్డప్‌ ఇచ్చిన శ్రీనాథ్ పెళ్లి మాట ఎత్తేసరికి అమ్మమ్మని అడగాలి.. నాన్నమ్మని అడగాలి. అమ్మను ఒప్పించాలంటూ సొల్లు కబుర్లు చెప్పాడు. వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానంటూ అమ్మాయిని మభ్యపెట్టి ఇప్పుడు మరో అమ్మాయితో పెళ్లి పీటలెక్కాడు. పెళ్లి విషయం తెలిస్తే బాధితురాలు వస్తుందని ముందే ఊహించిన శ్రీనాథ్‌ మగవాళ్లెవరూ ఆమె జోలికి పోకుండా జాగ్రత్త పడ్డాడు. తన బంధువులైన ఆడవాళ్లతో యువతిపై విచక్షణా రహితంగా దాడి చేయించాడు.

ఇదంతా కళ్యాణమండపం బయట నిలబడిన ఓ పోలీసు కానిస్టేబుల్ కళ్లముందే జరిగింది. యువతిని ఈడ్చుకెళుతుంటే…కనీసం అడ్డుకోలేదు. తనకేం పట్టనట్టు ఫోన్‌ చూసుకుంటూ ఉండిపోయాడు. యువతిని రోడ్డుపైకి ఈడ్చుకెళ్లిన తర్వాత కూడా అదే పరిస్థితి. మండపం గేట్‌ దగ్గర చాలా సేపు అతుక్కుపోయిన కానిస్టేబుల్.. యువతిపై గుంపులుగా మహిళలు దాడి చేస్తున్నా.. కనీసం ఆపాలని ప్రయత్నించలేదు. కానిస్టేబుల్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తల్లిదండ్రులు లేని అమ్మాయి.. అన్నయ్య ఉన్నా దూరంగా ఉన్నాడు. అనాథ కాబట్టి అడిగే వారుండరని శ్రీనాథ్ ఇంతకు తెగించాడు. స్కెచ్‌ వేసి మరీ అమ్మాయిని మోసం చేశాడు. అతడు చూపిన కపట ప్రేమనే అమరప్రేమగా భావించిన యువతి నిలువునా మోసపోయింది. పెళ్లి నిశ్చయం అయిందని తెలియగానే అతనికి కోర్టు నుంచి నోటీసులు పంపింది. అయినా ఆ యువకుడు స్పందించలేదు. దీంతో నోటీసులు తీసుకుని అబ్బాయి ఇంటికి వెళ్ళానని చెప్తోంది యువతి.
Also Read : Sonam Kapoor : సోనమ్ కపూర్ ఇంట్లో భారీ చోరీ.. ఇంట్లో పనిమనిషే 2.4 కోట్ల అపహరణ..

అలాగే అతనితో పెళ్లి నిశ్చయం చేసుకున్న యువతి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి విషయం చెప్పినా వారు పట్టించుకోలేదని తెలిపింది. ఆ తర్వాత స్థానిక పోలీసులకూ ఫిర్యాదు చేశామని వివరించింది. పెళ్లి మండపానికి ఒంటిరిగా వెళితే దాడి చేస్తారని..పోలీసుల సాయంతో వెళ్లినట్టు తెలిపింది. అయితే తనను అబ్బాయి బంధువులు కొడుతుంటే పోలీసులు చోద్యం చూశారని వాపోయింది. పోలీసులను అబ్బాయి తరఫు తల్లిదండ్రులు డబ్బులతో మేనేజ్ చేశారని ఆరోపించింది. దాంతో వారికి అనుకూలంగా పోలీసులు వ్యవహరించారని తెలిపిందామె. దానిపై ప్రశ్నిస్తే స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని దాటవేస్తున్నారని వాపోయింది యువతి. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో మళ్లీ ఫిర్యాదు చేసింది.