Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, లభించని ముగ్గురి ఆచూకీ

సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో రెస్క్యూ ఆపరేషణ్ కొనసాగుతోంది. ఇప్పటికీ వర్కర్ల ముగ్గురి ఆచూకీ తెలియలేదు. వారి కోసం తోటి వర్కర్లు దీనంగా భవనం వెయిట్ చేస్తున్నారు.

Ramgopalpeta Fire Incident : సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో రెస్క్యూ ఆపరేషణ్ కొనసాగుతోంది. ఇప్పటికీ వర్కర్ల ముగ్గురి ఆచూకీ తెలియలేదు. వారి కోసం తోటి వర్కర్లు దీనంగా భవనం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఆల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ టెస్టు చేసుందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. అగ్నిప్రమాదం తర్వాత బిల్డింగ్ పరిస్థితిని అంచాన వేసేందుకు ఈ టెస్టు చేస్తున్నారు. దీనిని ద్వారా ఏయే ప్రాంతాల్లో కాంక్రీట్ ఎక్కువగా డ్యామేజ్ అయిందో గుర్తించవచ్చు.

మరోవైపు ఘటనా స్థలిని సీపీఐ నేతలు పరిశీలించారు. అక్రమ కట్టడాల రెగ్యులరైజేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఘటనకు బాధ్యులపైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముగ్గురి ఆచూకీ ఇప్పటికీ తెలియకపోయినా జీహెచ్ఎంసీ కమిషనర్ పట్టించుకోకుండా ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. అదుపులోకి వచ్చిన మంటలు

అయితే అగ్నిప్రమాద ఘటనలో ఆ ముగ్గురు కూలీలు సజీవదహనమైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యమైన ముగ్గురు యువకుల మొబైల్ లొకేషన్ ప్రమాదం జరిగిన భవనంలోనే చూపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ముగ్గురు యువకులు భవనంలోనే చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఒకవేళ యువకులు భవనంలో చిక్కుకుపోయి ఉంటే, ముగ్గురూ సజీవదహనం అయి ఉండొచ్చని భావిస్తున్నారు.

యువకుల అదృశ్యంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అదృశ్యమైన ముగ్గురు కూలీలు కూడా బీహార్ కు చెందిన వారుగా గుర్తించారు. కూలీ పనులు చేసుకునేందుకు కొన్నేళ్ల క్రితం వారంతా బీహార్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. జువైన్, వసీం, అక్రమ్ లు ఈ అగ్నిప్రమాద ఘటనలో చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. వేడి, పొగ తగ్గిన తర్వాత క్లూస్ టీమ్ బిల్డింగ్ లోకి వెళ్లారు.

Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. 5, 6వ అంతస్తులకు లేని అనుమతులు

సికింద్రాబాద్ రాంగోపాల్ లోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనంలో 10 గంటలకు పైగా మంటలు ఎగసిపడ్డాయి. మూడు వైపుల నుంచి మొత్తం 15 ఫైరింజన్లను మోహరించి మంటలు ఆర్పేశారు. అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. కాగా, దట్టమైన పొగ కారణంగా పలువురు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి, వైద్యం అందించారు.

ట్రెండింగ్ వార్తలు