Revanth Reddy On Puvvada Ajay : కమ్మ కులం నుంచి పువ్వాడను బహిష్కరించాలి-రేవంత్ రెడ్డి

పువ్వాడ వేధింపులు, దుర్మార్గాలకు ఖమ్మంలో ఓ పార్టీ కార్యకర్త మృతి చెందాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కులాన్ని అడ్డు పెట్టుకుని పువ్వాడ అజయ్ బతకాలని..

Revanth Reddy On Puvvada Ajay : మంత్రి పువ్వాడ అజయ్ పై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పువ్వాడ వేధింపులు, దుర్మార్గాలకు ఖమ్మంలో ఓ పార్టీ కార్యకర్త మృతి చెందాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కులాన్ని అడ్డు పెట్టుకుని పువ్వాడ అజయ్ బతకాలని చూస్తున్నారని మండిపడ్డారు. పువ్వాడ అజయ్ వల్ల కమ్మ కులానికే చెడ్డ పేరు వస్తోందన్నారు. కమ్మ కులం నుంచి పువ్వాడ అజయ్ ను బహిష్కరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

మంత్రి పువ్వాడ అజయ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రేవండ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈడీ కేసులు, చనిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు, మమతా కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు రేవంత్. దమ్ముంటే పువ్వాడే సీబీఐ విచారణ కోరాలని రేవంత్ డిమాండ్ చేశారు. మరోవైపు పువ్వాడను కులం నుంచి బహిష్కరించాలని కమ్మ పెద్దలను కోరారు రేవంత్. కేసీఆర్ జీతగాళ్లలాగా పనిచేస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల పేర్లను డైరీలో నమోదు చేస్తున్నామని.. వారందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. ఒకవేళ అధికారులు రిటైర్ అయిపోయినా పట్టుకొచ్చి మరీ శిక్ష విధిస్తామన్నారు. కేసీఆర్ అంతానికి.. పువ్వాడ పతనానికి సమయం దగ్గరపడిందన్నారు రేవంత్ రెడ్డి.(Revanth Reddy On Puvvada Ajay)

Khammam Puvvada : ఖమ్మంలో పువ్వాడ తిరగకుండా అడ్డుకుంటాం జగ్గారెడ్డి హెచ్చరికలు

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ పోలీస్ స్టేషన్ దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ నాయకుడు, కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ కారణమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ప్రసన్న కృష్ణ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేకే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. వారిపై చర్యలు తీసుకోవాలని అతని అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Telangana : కమ్మ వాళ్లను తొక్కేస్తున్నారు.. ఐక్యతగా ఉండాలి – మంత్రి పువ్వాడ

సాయి గణేశ్ ఆత్మహత్య వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. అధికార టీఆర్ఎస్ ను బీజేపీ టార్గెట్ చేసింది. బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ కార్యకర్త మృతికి కారణమైన మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేసి.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా.. సాయి గణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాకుండా భదాద్రి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. సాయి గణేశ్ ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరపాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ ముఖ్యులు కూడా సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించి.. మంత్రి పువ్వాడపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు