Khammam Puvvada : ఖమ్మంలో పువ్వాడ తిరగకుండా అడ్డుకుంటాం జగ్గారెడ్డి హెచ్చరికలు

కాంగ్రెస్ కౌన్సిలర్ లను వేధించి.. పీడీ యాక్ట్ లు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పువ్వాడ మాత్రమే కమ్మ కులం కాదు.. చనిపోయిన సాయి...

Khammam Puvvada : ఖమ్మంలో పువ్వాడ తిరగకుండా అడ్డుకుంటాం జగ్గారెడ్డి హెచ్చరికలు

Jaggareddy

Jaggareddy : తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లాలో తిరగకుండా అడ్డుకుంటామని, పోలీసులలో కొందరు తొత్తులుగా మారి అరాచకాలకు సహకరిస్తున్నారని.. వారి సంగతి చూస్తామని తీవ్రస్వరంతో హెచ్చరించారు. 2022, ఏప్రిల్ 23వ తేదీ శనివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో.. గాంధీ భవన్ లో మంత్రి పువ్వాడ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పువ్వాడ ఇప్పుడు మెడికల్ మాఫియాగా మారారని, ఆయన మెడికల్ కాలేజ్ లో భారీగా అవకతవకలు జరిగాయనే వార్తలు వచ్చినట్లు.. ఇలాంటి మంత్రిని కేసీఆర్ ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. మంత్రి పువ్వాడను కాపాడుకోవడం ముఖ్యమా ? లేక ప్రజలా అనేది ముఖ్యమా ఆలోచన చేయాలని హితవు పలికారు. మంత్రి పువ్వాడ అరాచకాలను సీఎం కేసీఆర్ కు గుర్తు చేస్తున్నట్లు, కాంగ్రెస్ కౌన్సిలర్ లను వేధించి.. పీడీ యాక్ట్ లు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పువ్వాడ మాత్రమే కమ్మ కులం కాదు.. చనిపోయిన సాయి కూడా అదే కులమన్నారు. కులం పేరు చెప్పడానికి పువ్వాడకు సిగ్గనిపించడం లేదా.. ప్రాణం పోవడం కూడా చిన్న ఇష్యూనా.. మెడికల్ మాఫియాకు అడ్డాగా మారిన ఆయన హాస్పిటల్ ను ముట్టడిస్తామన్నారు జగ్గారెడ్డి.

Read More : High Court : ఖమ్మం సాయిగణేష్ ఆత్మహత్య కేసు.. మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు

కమ్మ వాళ్లంతా ఐక్యంగా ఉండాలి..కమ్మ కులస్తులు రాజకీయాలకతీతంగా ఐక్యతగా ఉండాలని ఇటీవలే తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ విషయంలో కుట్రలు చేస్తూ.. కుతంత్రాలు పన్నుతూ ఏకమౌతున్నారని ఆరోపించారు. కొంతమంది సూడో చౌదరీలు చేతులు కలుపుతున్నారని.. దీనిని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ పీఎస్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డిన సంగతి తెలిసిందే. దీనిని బీజేపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. అతను సూసైడ్ చేసుకోవడానికి కారణం మంత్రి పువ్వాడ.. ఇతర టీఆర్ఎస్ నేతలని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేక సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేసి ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు సైతం నిర్వహించింది. ఈ విషయంలో కేంద్రం కూడా రంగంలోకి దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సాయి గణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. పలువురు కేంద్ర మంత్రులు ఖమ్మం జిల్లాకు చేరుకుని ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.

Read More : Telangana : కమ్మ వాళ్లను తొక్కేస్తున్నారు.. ఐక్యతగా ఉండాలి – మంత్రి పువ్వాడ

మరోవైపు.. ఖమ్మం సాయిగణేష్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ఈ కేసులో మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మరో ఆరుగురికి కూడా నోటీసులు పంపింది. పోలీసుల వేధింపులతోనే సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సాయి గణేష్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని అడ్వకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు.