Revanth reddy
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫార్మాసిటీ రద్దు వంటి అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్లు మెట్రో విస్తరణ ఉంటుందన్నారు.
ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో నిర్మిస్తామన్నారు. ఓఎస్ ఆసుపత్రి మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద విమానాశ్రాయనికి వెళ్లే మెట్రో లైనుకి లింక్ చేస్తామని చెప్పారు.
మియాపూర్ నుంచి రామచంద్ర పురం వరకు మెట్రో పొడిగించే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు విస్తరిస్తామన్నారు. గచ్చిబౌలి ఏరియా నుంచి విమానాశ్రయానికి మెట్రోలో వెళ్లేవారు దాదాపు ఉండరని అభిప్రాయపడ్డారు.
తాము ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువని రేవంత్ రెడ్డి చెప్పారు. అధిక ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు.
ఫార్మాసిటీని అంచలంచలుగా రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. కాగా. తాము ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జిలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు.
Also Read: జుట్టు పట్టుకుని.. బస్సులో మహిళల మధ్య భీకరపోరు.. వీడియో వైరల్