Free Bus: జుట్టు పట్టుకుని.. బస్సులో మహిళల మధ్య భీకరపోరు.. వీడియో వైరల్
దీంతో సీట్లో కూర్చున్న మహిళ తన పిల్లాడిని పక్కకు ఎత్తి పడేసి మరీ ఎదుటి మహిళతో ఫైటింగ్ చేసింది..

women fight for seats
అసలే పండుగ సీజన్.. ఆపై తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు.. దీంతో బస్సులన్నీ నిండిపోతున్నాయి. మహిళలు తమ పిల్లలతో కలిసి పలు ప్రాంతాలను సందర్శిస్తూ తీరికలేకుండా గడుపుతున్నారు.
బస్సులన్నీ మహిళలతో నిండిపోతుండడంతో వాటిల్లో గొడవలు చెలరేగుతున్నాయి. బస్సులో సీట్ల కోసం మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకునే ఘటనలు సంభవిస్తున్నాయి. తాజాగా, జహీరాబాద్ నుంచి సంగారెడ్డికి వస్తున్న బస్సులో మహిళలు సీట్ల కోసం దారుణంగా కొట్టుకున్నారు.
సీటుపై మొదట తాను రుమాలు వేస్తే సీటులో ఇతర మహిళ కూర్చుందని ఓ యువతి గొడవ పెట్టుకుంది. దీంతో సీట్లో కూర్చున్న మహిళ తన పిల్లాడిని పక్కకు ఎత్తి పడేసి మరీ ఎదుటి మహిళతో ఫైటింగ్ చేసింది. వారు జుట్టు పట్టుకుని కొట్టుకుంటుండగా తోటి మహిళా ప్రయాణికులు ఆ గొడవను ఆపకుండా వీడియోలు తీశారు. వారు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
బస్సుల్లో పదే పదే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బస్సులన్నీ నిండిపోతున్నప్పటికీ బస్సుల సంఖ్యను పెంచకుండా అధికారులు చోద్యం చూస్తున్నారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రీ బస్ ఎఫెక్ట్!!
జహీరాబాద్ నుండి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ.. దారుణంగా కొట్టుకున్న మహిళలు. pic.twitter.com/ah7wceH6vl
— Telugu Scribe (@TeluguScribe) January 1, 2024
Bairi Naresh: మరో వివాదంలో బైరి నరేశ్.. అయ్యప్ప భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకెళ్లిన వైనం