Revanth Reddy
GHMC: గ్రేటర్ రూపు మారింది. ఔటర్ వరకు విస్తరించింది. 20 మున్సిపాలిటీలు..ఏడు కార్పొరేషన్ల విలీనంతో…మహానగర విస్తీర్ణం పెద్దగా అయిపోయింది. దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా GHMC మారిపోతుంది. అయితే విలీనం తర్వాత గ్రేటర్‌ను మూడు ముక్కలు చేస్తారన్న టాక్ నడిచింది. కానీ గతంలో 150 వార్డులు ఉంటే..ఇప్పుడు 3 వందల వార్డులకు పెంచి ఆ చర్చను వెనక్కి నెట్టింది సర్కార్.
డీలిమిటేషన్‌పై పొలిటికల్ పార్టీలు కస్సుబుస్సుమంటుండగానే..జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు అంటూ పోస్టింగ్‌లు ఇచ్చేసింది. అధికారులు కూడా ఎవరికి వారు పైరవీలు, లాబీయింగ్‌లు చేసి కోరుకున్న చోట పోస్టింగ్ తెచ్చుకున్నారు. అయినా GHMC విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టత రావడం లేదు. గ్రేటర్ మొత్తాన్ని ఒకే మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉంచుతారా లేక వంద వార్డులకు ఒక కార్పొరేషన్ కింద మూడు ముక్కలు చేస్తారా అన్నది ఇప్పటికీ డౌట్‌గానే ఉంది.
విలీనం, విభజనపై గందరగోళం నడుస్తూ ఉండగానే..పోస్టింగులు, ఆఫీసులు..అంటూ అన్నీ చక్కబెట్టే ప్రయత్నం చేస్తోంది రేవంత్ సర్కార్. విలీనం, వార్డుల విభజన లెక్కేంటనేదానిపై విపక్ష పార్టీలకు క్లారిటీ వచ్చేలోపే సర్కార్ డెసిషన్స్ షాకింగ్ మారాయి. కలెక్టర్లు, వివిధ శాఖలకు బాస్‌లుగా పనిచేసిన అధికారులను GHMC కమిషనర్ కింద పోస్టింగ్ వేశారు. కొంతమందిని పూర్తిగా డిప్యూటీ కమిషనర్ పోస్ట్ నుంచి తొలగించి జాయింట్ కమిషనర్లుగా నియమించి చర్చకు దారితీశారు బల్దియా బాస్.
ఈ పోస్టింగ్‌లల్లో అవినీతి ఆరోపణలు వస్తున్నాయ్. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోకపోగా..అదే హోదాలో కంటిన్యూ చేయడం విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలా సర్కిల్స్, వార్డులు, జోనల్స్..అధికారుల పరిధిలు ఎన్నో సమస్యలున్నా..సర్కార్ మాత్రం స్పీడ్‌గా డెసిషన్స్ తీసుకోవడం వెనక ప్లానేంటన్నది హాట్ టాపిక్ అవుతోంది. గ్రేటర్‌లో విలీనం, విభజన విషయంలో ఇప్పటికీ చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని..అవేమి పట్టించుకోకుండా సర్కార్ ముందుకెళ్తుందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినా ఐ డోంట్ కేర్ అంటున్నారు సీఎం రేవంత్. అయితే GHMC విషయంలో రేవంత్ దూకుడు నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు.
ఫిబ్రవరిలో GHMC పాలక వర్గం గడువు ముగుస్తుంది. దీంతో జనవరి చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ ప్రకారం GHMC ఎన్నికలు పెట్టి గ్రేటర్‌లో పాగా వేయాలని రేవంత్ ప్లాన్ అంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు..GHMC ఎలక్షన్స్ పెట్టి తీరాలని భావిస్తున్నారట. జనవరి చివరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలంటే అంతా లోపే మొత్తం సెట్ చేయాలని డిసైడ్ అయ్యారట.
అందుకే విపక్షాలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా..లాస్ట్‌కు కొందరు కోర్టుకు వెళ్లినా అన్ని అడ్డంకులను దాటి వార్డుల విభజన..సర్కిల్స్, జోన్ల వారీగా అధికారులకు పోస్టింగ్ వంటి కీలక డెసిషన్స్ తీసుకున్నారని అంటున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చారట. బీసీ కోటా అంశం కోర్టులో ఉండటంతో చట్ట ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి..పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారట.
జనవరి మధ్యలో సంక్రాంతి పండగ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఫిబ్రవరిలో మూడు విడతల్లో పోలింగ్ పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. మార్చిలో విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉండటంతో, ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఎన్నికల ప్రక్రియను క్లోజ్ చేయాలని భావిస్తున్నారట. గ్రేటర్‌పై రేవంత్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.