ప్రమాదం అంచున గురుకుల విద్యా వ్యవస్థ.. కొండా సురేఖ మాటలు సరికాదు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ 

కొండా సురేఖపై తెలంగాణ ప్రజలకు స్పష్టత పూర్తిగా వచ్చిందని, సభ్యత, సంస్కారంలేని ఆమె మాటలపై కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించిందని అన్నారు.

RS Praveen Kumar

కాంగ్రెస్‌ సర్కారుపై బీఆర్ఎస్‌ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో విద్యా, సంక్షేమ శాఖలకు మంత్రులు లేరని చెప్పారు. ఏడాది కాలంలో దాదాపు 50 మంది విద్యార్థులు మృతి చెందారని అన్నారు.

గురుకుల విద్యా వ్యవస్థ ప్రమాదపు అంచున చేరిందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురుకులాల్లో పరిస్థితిపై గురుకుల బాట చేయాలని పిలుపు ఇచ్చామని, ఈ పిలుపుతోనే కాంగ్రెస్ నేతల్లో వణుకు పుట్టిందని చెప్పారు.

ముఖ్యమంత్రికి ఈ విషయంపై మీడియా ముందుకు వచ్చే ధైర్యం లేక మతిస్థిమితంలేని మంత్రులను పంపిస్తున్నారని మండిపడ్డారు. కొండా సురేఖపై తెలంగాణ ప్రజలకు స్పష్టత పూర్తిగా వచ్చిందని, సభ్యత, సంస్కారంలేని ఆమె మాటలపై కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించిందని అన్నారు.

కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదని, తాను దేశ రక్షణ కోసం 26 ఏళ్లు పని చేశానని చెప్పారు. 15 ఏళ్ల సర్వీస్ ఉన్నప్పటికీ తాను విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. విద్యార్థుల గురించి ఎప్పుడైనా సురేఖ ఆలోచించారా అని నిలదీశారు. తల్లిదండ్రులు బిడ్డలకు ఎక్కడైన విషం పెడుతారా అని నిలదీశారు. తమ గురించి మాట్లాడే అర్హత సురేఖకు లేదని చెప్పారు.

మొన్నటి ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి ఓటేశారు: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు