Revanth Reddy: కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్‌ భేటీ.. కాంగ్రెస్‌లో చేరుతారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను కలిసి తిరిగి పార్టీలో యాక్టీవ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Konda

Revanth Reddy meets Konda Vishweshwar Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను కలిసి తిరిగి పార్టీలో యాక్టీవ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డితో రేవంత్‌రెడ్డి భేటి అయ్యారు. కొండా ఇంటికి వెళ్లి కలిసిన రేవంత్.. కాంగ్రెస్‌లోనే కొనసాగాలని కోరారు.

రేవంత్ చర్చలు ఫలించినా.. అయితే కాంగ్రెస్‌లో తిరిగి చేరే విషయమై క్లారిటీ ఇవ్వలేదు విశ్వేశ్వర్ రెడ్డి. ఈ సంధర్భంగా మాట్లాడిన విశ్వేశ్వర రెడ్డి, కేసీఆర్‌కు పోటాపోటీగా కొట్లాడే నాయకులు రేవంత్ రెడ్డేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్‌కు టీపీసీసీ రావడంతో బలమైందని, కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే దీక్షలకు సపోర్ట్ చేస్తానని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ చేపట్టే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని ప్రకటించారు.

భేటీ అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ మంచి కోసం పరితపిస్తుంటారని, రాజకీయాలే కాదు.. రాష్ట్రాభివృద్ధిపైన చర్చించినట్లు చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎప్పుడైనా రావొచ్చని, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలకు అయన ఎప్పుడూ వ్యతిరేకం కాదని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాత విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా.. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత విశ్వేశ్వరరెడ్డితో పలువురు నేతలు మంతనాలు జరిపినా.. ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగినా.. రేవంత్ రాకతో విశ్వేశ్వరరెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది.