Revanth Reddy : నిరూపిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయం- రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

Revanth Reddy Challenge : మీ నామినేషన్ల ఉపసంహరణ కూడా మేము అడగటం లేదు. కేవలం క్షమాపణ చెబితే చాలు.

Revanth Reddy Challenge

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరెంట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయం విద్యుత్ చుట్టూ తిరుగుతోంది. కరెంటు వ్యవహారంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో వ్యవసాయానికి రోజుకు 24గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే మేము ఎన్నికల్లోనే పోటీ చేయము అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లోని ఏ సబ్ స్టేషన్ కు అయినా వెళ్లేందుకు రెడీ అన్నారు రేవంత్ రెడ్డి. మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ తన సవాల్ ను స్వీకరించాలన్నారు రేవంత్ రెడ్డి.

Also Read : ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు వేస్తామన్న ప్రధాని మోదీ హామీ ఏమైంది? కాంగ్రెస్ ఫైర్

ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి..
‘ఒకవేళ రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే మీరు అమరవీరుల స్థూపం దగ్గర కుటుంబం మొత్తం ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీ నామినేషన్ల ఉపసంహరణ కూడా మేము అడగటం లేదు. కేవలం క్షమాపణ చెబితే చాలు. ఉచిత విద్యుత్ పేటెంటే కాంగ్రెస్ పార్టీది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన దేశంలోనే మొట్టమొదటి సారి చేసి, అది అమలు చేసి చూపించిన పార్టీ కాంగ్రెస్’ అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

రెడ్ డైరీలో వారి పేర్లు రాశాం..
”కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దు. బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి. బీఆర్ఎస్ నేతల్లా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై మా నాయకులు రెడ్ డైరీలో రాసి పెడుతున్నారు. అధికారంలోకి రాగానే వారిపై చర్యలు ఉంటాయి. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ పై సూటిగా సవాల్ విసురుతున్నా. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళదాం. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కొడంగల్ లో నన్ను ఓడిస్తానంటున్న కేటీఆర్.. ముందు సిరిసిల్లలో చూసుకోవాలి” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : నన్ను చంపేందుకు కుట్ర, నాపై దాడి చేసింది వారే- గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు