Revanth Reddy : అధికారిక కాన్వాయ్‌కు నో చెప్పిన రేవంత్ రెడ్డి.. చివరికి అధికారులు ఏం చేశారంటే?

విమానాశ్రయంలో డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతి కుమారి సహా పలువురు ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఆయనకు అధికారికంగా ఏర్పాటు చేసే కాన్వాయ్ ని సిద్ధం చేశారు.

Revanth Reddy

Telangana New CM : తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాటు చేశారు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ జాతీయ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు, ముఖ్యనేతలు హాజరు కానున్నారు. దీంతో ఎల్బీ స్టేడియంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉంటే రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించిన వెంటనే మంగళవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆ రోజు పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.

Also Read : Telangana Congress Government : తెలంగాణలో కీలక అధికారుల మార్పునకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు

బుధవారం ఉదయం నుంచి ఢిల్లీలో రేవంత్ బిజీబీజీగా గడిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే లతో భేటీ అయిన రేవంత్.. ఆ తరువాత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో సమావేశం అయ్యారు. ప్రమాణ స్వీకారానికి వీరిని ఆహ్వానించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీలో బిజీబిజీగా గడిపిన రేవంత్.. బుధవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. రాత్రి 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రేవంత్ చేరుకున్నారు. రేవంత్ కు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Also Read : KCR : ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం ముందుకు వచ్చిన కేసీఆర్.. వీడియో వైరల్

విమానాశ్రయంలో డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతి కుమారి సహా పలువురు ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఆయనకు అధికారికంగా ఏర్పాటు చేసే కాన్వాయ్ ని సిద్ధం చేశారు. కాన్వాయ్ లో వెళ్లాలని అధికారులు రేవంత్ రెడ్డిని కోరారు. కానీ, రేవంత్ అందుకు ఒప్పుకోలేదు. నేను ఇంకా ప్రమాణ స్వీకారం చేయనందున కాన్వాయ్ వద్దంటూ తనతోపాటు ఢిల్లీ నుంచి వచ్చిన మాణిక్ రావు ఠాక్రేతో కలిసి సొంత వాహనంలో విమానాశ్రయం నుంచి రేవంత్ బయలుదేరారు. కానీ, భద్రతా కారాణాలరిత్యా కాన్వాయ్ ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమదంటూ డీజీపీ, తదితర అధికారులు రేవంత్ వాహనాన్ని అనుసరించారు. అనంతరం రేవంత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ కు వెళ్లారు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు