KCR : ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం ముందుకు వచ్చిన కేసీఆర్.. వీడియో వైరల్

కేసీఆర్ ను చూడగానే ఒక్కసారిగా.. సీఎం కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు.

KCR : ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి జనం ముందుకు వచ్చిన కేసీఆర్.. వీడియో వైరల్

People Meet KCR (Photo : Google)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టిన ఓటర్లు ఈసారి మాత్రం ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. హస్తం పార్టీకి జై కొట్టారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు అయ్యింది. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Also Read : సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. సీఎం జగన్, మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుకు ఆహ్వానం

కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి జనం ముందుకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. కేసీఆర్ ను చూడగానే ఒక్కసారిగా.. సీఎం కేసీఆర్ అనే నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. కేసీఆర్ వారందరికీ అభివాదం చేశారు. కేసీఆర్ పక్కనే మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఉన్నారు.

Also Read : కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఆర్నెళ్లే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

ఎర్రవెల్లి గ్రామంలో తన నివాసంలో ఉన్న కేసీఆర్ ను చూసేందుకు చింతమడక (కేసీఆర్ స్వగ్రామం) నుంచి పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. వారి ముందుకు కేసీఆర్ రాగానే.. వారంతా కొంత ఎమోషన్ అయ్యారు. సీఎం సీఎం.. సీఎం కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయనపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.