Revanth Reddy : రేపే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. సీఎం జగన్, మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుకు ఆహ్వానం

రేపే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం తరలిరానుంది. అలాగే ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ చంద్రబాబులకు ఆహ్వానాలు పలికారు.

Revanth Reddy : రేపే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. సీఎం జగన్, మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుకు ఆహ్వానం

Revanth Reddy to Take Oath at LB Stadium

Revanth Reddy to Take Oath : తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించాక సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం పీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సీఎంగా రేవంత్ రెడ్డి రేపే ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్ సీఎంగా తన పేరు వెలువడిన వెంటనే అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు.. మాణిక్ ఠాగూర్ తోనూ భేటీ అయ్యారు. ఈరోజు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని వారిని కోరారు. అనంతరం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ. రాహుల్ గాంధీలతో కూడా భేటీ అయ్యారు. వారిని తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.

రేవంత్ ప్రమాణస్వీకార మహోత్సవానికి తెలంగాణ సీఎస్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నాం స్టేడియంలో మధ్యాహ్నాం 1.04 గంటలకు జరుగనున్న ప్రమాణస్వీకారం ఏర్పాట్లను సీఎస్, డీజీపీ పరిశీలించారు. రేవంత్ తో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణస్వీకారానికి మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ,ప్రియాంకా గాంధీలతో పాటు ఏఐసీసీ నేతలకు ఆహ్వానాలు పలికారు. అలాగే కర్ణాటక సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆహ్వానాలు పలికారు. చిదంబరం, మీరా కుమారి, సుశీల్ కుమార్, కురియన్,తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్,కంచ ఐలయ్యతో పాటు మరికొందరు ఉద్యమకారులకు ఆహ్వానాలు పలికారు.

అలాగే.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు ఆహ్వాహానాలు పలికారు. అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్, సినీ నటుటు, మేధావులకు కూడా ఆహ్వానాలు పలికారు. ఇంతమంది ప్రముఖుల మధ్య రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లను తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజేపీలు పరిశీలిస్తున్నారు.