BJP MLA Rajasingh : కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఆర్నెళ్లే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ స్కీంలను అమలు చేస్తా అని రేవంత్ చెప్పారు. దళితులకు మోసంచేస్తే బీజేపీ కార్యకర్తలు వదిలిపెట్టరు రేవంత్ అంటూ రాజాసింగ్ హెచ్చరించారు.

BJP MLA Rajasingh : కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఆర్నెళ్లే.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

BJP MLA Raja Singh

Telangana Congress Leader : బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, కొప్పు భాషా తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడారు. దేశంలో అన్నివర్గాల ప్రజలు గర్వంగా జీవిస్తున్నా, న్యాయం జరుగుతుందన్నా అది అంబేద్కర్ చలవేనని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆయన్ను స్మరించుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ పై రాజాసింగ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో రావణ రాజ్యం అంతం అయిందని అన్నారు. కేసీఆర్ రావణుడు.. తెలంగాణ ప్రజలను మోసం చేశాడని, ఎస్సీలను కేసీఆర్ మోసం చేశాడని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Rahul Gandhi : రేవంత్ రెడ్డితో భేటీ తరువాత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ .. ఫొటోలను షేర్ చేసిన రాహుల్

దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేసిండు, దళితులందరికీ మూడెకరాల భూమి, దళిత బంధు ఇవ్వలేదు. అంబేద్కర్ కు ఎప్పుడూ నివాళులు అర్పించలేదని రాజాసింగ్ కేసీఆర్ పై విమర్శలు చేశారు. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు బీజేపీతోనే జరిగిందని, బీజేపీ ఒత్తిడితోనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. ఎస్సీ సమాజాన్ని మోసం చేసిన కేసీఆర్ ఫాం హౌస్ లో కూర్చున్నాడు. కేసీఆర్ ను, ఆయన కుటుంబంను ప్రజలు బహిష్కరించారని రాజాసింగ్ అన్నారు.

Also Read : Revanth Reddy : సోనియా, రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం.. రేపు మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్

కేసీఆర్ స్కీంలను అమలు చేస్తా అని రేవంత్ చెప్పారు. దళితులకు మోసంచేస్తే బీజేపీ కార్యకర్తలు వదిలిపెట్టరు రేవంత్ అంటూ హెచ్చరించారు. అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి నరేంద్ర మోదీ అని రాజాసింగ్ అన్నారు. రాష్ట్రంలో చాలా రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. ఆర్నెళ్లు లేదా ఏడాది మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చడంలో విఫలమవుతుంది. ఆరు గ్యారెంటీలు పేరుతో మోసపూరిత హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. ఆర్నెళ్లు.. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. త్వరలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.