Rahul Gandhi : రేవంత్ రెడ్డితో భేటీ తరువాత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ .. ఫొటోలను షేర్ చేసిన రాహుల్

రాహుల్ గాంధీ ట్వీట్ లో.. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డికి అభినందనలు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ..

Rahul Gandhi : రేవంత్ రెడ్డితో భేటీ తరువాత రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ .. ఫొటోలను షేర్ చేసిన రాహుల్

Revanth Reddy

Revanth Reddy : తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. మంగళవారం సాయంత్రం సీఎంగా రేవంత్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి రేవంత్ కు పిలుపు రావడంతో ఆయన రాత్రి ఢిల్లీ వెళ్లారు. నిన్న రాత్రి పలువురి కాంగ్రెస్ నేతలతో రేవంత్ భేటీ అయ్యారు. మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై చర్చించారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్, పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేలతో రేవంత్ భేటీ అయ్యి వారిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

Also Read : Revanth Reddy : రేపే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం .. సీఎం జగన్, మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు ఆహ్వానం

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని రేవంత్ వారిని కోరారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీతో సుమారు 50 నిమిషాల పాటు రేవంత్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పు, ప్రమాణ స్వీకారం తరువాత అమలు చేయాల్సిన పథకాలు, తదితర అంశాలపై రాహుల్ తో రేవంత్ చర్చించారు. ఈ సందర్భంగా రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్ ను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. రేవంత్ తో భేటీ తరువాత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Also Read : Revanth Reddy : సోనియా, రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం.. రేపు మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్

రాహుల్ గాంధీ ట్వీట్ లో.. ‘తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డికి అభినందనలు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చి ప్రజా సర్కార్ ని నిర్మిస్తుందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, తెలంగాణలో ప్రజల ప్రభుత్వం ఏర్పాటవుతుందని రాహుల్ చెప్పారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి రేవంత్ పుష్పగుచ్చం అందించిన ఫొటోలను ట్విటర్ లో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.