Revanth Reddy : సోనియా, రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం.. రేపు మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్

రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రి వర్గం కూర్పు వంటి విషయాలపై సోనియాగాంధీ దృష్టికి రేవంత్ తీసుకెళ్లినట్లు తెలిసింది.

Revanth Reddy : సోనియా, రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం.. రేపు మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్

Revanth Reddy

Revanth Reddy meet Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రేపు ఎల్బీ స్టేడియంలో రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదిలాఉంటే.. సీఎంగా తన పేరు వెలువడిన వెంటనే అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ ఢిల్లీ వెళ్లారు. నిన్నరాత్రి ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత మాణిక్ ఠాగూర్ తోనూ భేటీ అయ్యారు. బుధవారం ఉదయం నుంచి రేవంత్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్,  పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని వారిని కోరారు. అనంతరం రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు.

Also Read : Telangana Congress : సీఎం పదవి కన్నా ఆ పోస్టుకే ఎక్కువ డిమాండ్.. కాంగ్రెస్‌లో పదవుల పంచాయితీ, హైకమాండ్‌కు కొత్త తలనొప్పి

తెలంగాణ సీఎంగా ఎంపిక చేసినందుకు సోనియాగాంధీకి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రి వర్గం కూర్పు వంటి విషయాలపై సోనియాగాంధీ దృష్టికి రేవంత్ తీసుకెళ్లినట్లు తెలిసింది. సీఎంగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని సోనియాను రేవంత్ కోరారు. అనంతరం రాహుల్ గాంధీతోనూ రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ రేవంత్ ను అభినందించారు. వీరి భేటీ దాదాపు 50 నిమిషాల పాటు సాగింది. మంత్రి వర్గ కూర్పు, అధికారం చేపట్టిన తరువాత అమలు చేసే కార్యక్రమాలు తదితర విషయాలపై రాహుల్ వద్ద రేవంత్ ప్రస్తావించినట్లు తెలిసింది. అనంతరం రేపు జరిగే ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని రాహుల్ ను రేవంత్ ఆహ్వానించారు. వీరితోపాటు ప్రియాంక గాంధీ, ఏఐసీసీ నేతలకు, కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులను ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని రేవంత్ ఆహ్వానించారు.

Also Read : Balakrishna : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ శుభాకాంక్షలు

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో వేగంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లను సీఎస్, డీజీపీ రవి గుప్తా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తొలుత రేపు ఉదయం 10గంటల సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అయితే, ఆ సమయంలో మార్పు చేసినట్లు తెలిసింది. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు గవర్నర్ కురాసిన లేఖలో పేర్కొన్నారు. రేవంత్ తో పాటు పలువురు మంత్రులుకూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నారు.