Revanth Reddy : దివ్యాంగురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్న రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే..

దివ్యాంగురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకోనున్నారు రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. తన ప్రమాణస్వీకారం పూర్తి అయిన వెంటనే ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు ఆమెను కార్యక్రమానికి ఆహ్వానించారు.

Revanth Reddy, Rajini

Revanth Reddy promise to disabled women Job : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గెలుపు సాధించిన తరువాత కూడా తను ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎంఏ చదివి ఉద్యోగం లేక కష్టపడుతున్న ఓ దివ్యాంగురాలికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోనున్నారు.

అక్టోబర్ 17న తనవద్దకు వచ్చిన రజని అనే దివ్యాంగురాలికి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఆమె ఇచ్చిన మాట ప్రకారం.. రేపు సీఎంగా తన ప్రమాణస్వీకారానికి రావాలని రజనీని ఆహ్వానించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయ్యాక రజనీ ఉద్యోగ నియామక పేపర్స్ పై సంతకం చేసి రజనీకి ఇవ్వనున్నారు. దీంట్లో భాగంగా రజనీకి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పంపించారు.

Also Read: రేపే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం .. సీఎం జగన్, మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు ఆహ్వానం

ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని ఎంఏ వరకు చదువుకున్నానని..చదువు పూర్తి అయ్యాక తాను ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదని..ప్రైవేటు సంస్థలు కూడా తనకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు రాలేదని ఆమె రేవంత్ తో చెప్పుకుని వాపోయారు. ఉద్యోగం లేక ఎంతో కష్టపడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె బాధను అర్థం చేసుకుకున్న రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగం ఇచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రమాణస్వీకారం రోజునే రజనీకి ఉద్యోగం కల్పించే ఫైల్ పై సంతకం చేయనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు