Revanth Reddy: రాజకీయంగా నష్టపోతుందని తెలిసినా.. రాష్ట్రాన్ని ఇచ్చారు సోనియా
ప్రపంచం ముందు భారత్ శక్తిమంతమైన దేశంగా నిలబడటం కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి స్వేచ్ఛావాయువులను ఇచ్చిందని.. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారంటూ విమర్శలు గుప్పించారు.

Revanth
Revanth Reddy: ప్రపంచం ముందు భారత్ శక్తిమంతమైన దేశంగా నిలబడటం కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి స్వేచ్ఛావాయువులను ఇచ్చిందని.. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారంటూ విమర్శలు గుప్పించారు.
‘క్విట్ ఇండియా డే’ సందర్భంగా గాంధీభవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మాట్లాడిన రేవంత్.. కేసీఆర్, మోదీ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దళిత, గిరిజన వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి ఆ వర్గాలకు తీవ్ర నష్టం చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని.. రాజకీయంగా కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినా యువకుల బలిదానాలకు సోనియా చలించిపోయి తెలంగాణ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆశయాలు అమలు కావడం లేదన్నారు.
కార్యక్రమం అనంతరం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఇంద్రవెల్లి సభకు ర్యాలీగా తరలివెళ్లారు. అక్కడ దండోరా వాయించి అభిమానుల్లో జోష్ నింపారు.