TPCC Chief : రేవంత్ నియామకంపై స్పందించిన ఆర్జీవీ

TPCC Chief : రేవంత్ నియామకంపై స్పందించిన ఆర్జీవీ

Tpcc Chief

Updated On : June 26, 2021 / 9:52 PM IST

TPCC Chief : టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరలేపడంతో కాంగ్రెస్ నేతలు, రేవంత్ రెడ్డి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ విషయంపై స్పందించారు.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించడంతో కాంగ్రెస్ పై మరోసారి ఆసక్తి కలిగిందని తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు పులులన్నీ సింహానికి భయపడతాయని ట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ