road accident two injured : హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆదివారం (నవంబర్ 22, 2020) బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది.
బెంజ్ కారు అతివేగంగా వచ్చి ఇండికా క్యాబ్ ను ఢీకొట్టింది. దీంతో ఇండికా క్యాబ్ లో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయి.
బెంజ్ కారులో ముగ్గురు యువకులు, యువతి ఉన్నారు. మద్యం మత్తులో బెంజ్ కారు నడిపినట్లు గుర్తించారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.