Rythu Bandhu : రైతు సంబరాలు…వరినారుతో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలు

పలు జిల్లాల్లో రైతు బంధు వేడుకలను వినూత్నంగా జరుపుతున్నారు టీఆర్ఎస్‌ నేతలు. వరినారుతో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలను తయారు చేశారు. ట్రాక్టర్ ర్యాలీలతో హోరెత్తించారు...

Rythu Bandhu Celebration : తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు సంబురాలు కొనసాగుతున్నాయి. 64 లక్షల మంది అన్నదాతలకు 50వేల కోట్ల పెట్టుబడి అందించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రైతులు సంక్రాంతికి ముందే సంబురాల్లో మునిగి తేలుతున్నారు. తెలంగాణలోని అన్నిజిల్లాల్లో రైతుబంధు సంబురాలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి వరకు రైతు బంధు సంబురాలను కొనసాగించాలని టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో చేరడంతో తెలంగాణలో సంక్రాంతి ముందే వచ్చిందన్నారు కేటీఆర్. రైతుబంధు పథకం సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక అన్నారు. ఈ పథకం కింద 64లక్షల మందికి 50వేల కోట్ల పెట్టుబడి సాయం అందించామన్నారు టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ కోటి రతనాల వీణే కాదు.. ముక్కోటి ధాన్యాలు పండిస్తున్న రాష్ట్రం అన్నారు.

Read More : PNB Charges : PNB బ్యాంకు కస్టమర్లకు ఛార్జీల మోత.. ఎప్పుటినుంచంటే?

రైతుబంధు సంబురాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు కేటీఆర్. కొంతమంది పొలిటికల్‌ టూరిస్టులు ఏవేవో మాట్లాడుతున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైతుబంధు పథకాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు కూడా సాయం అందుతోందని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకం పథకం ఉంటే చెప్పాలని సవాల్‌ విసిరారు మంత్రి కేటీఆర్‌.

Read More : Zomato Delivery: తప్పతాగిన పోలీస్.. కారుతో ఢీకొట్టడంతో జొమాటో డెలివరీ బాయ్ దుర్మరణం

సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంది కాబట్టే రైతు బంధు అందిస్తున్నారన్నారు మంత్రి హరీశ్‌రావు. బీజేపీకి అన్నదాతలపై ప్రేమ ఉంటే దేశమంతటా రైతు బంధు అమలు చేయాలన్నారు. రైతుల ఖాతాల్లో నగదు జమచేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు పలు జిల్లాల్లో రైతు బంధు వేడుకలను వినూత్నంగా జరుపుతున్నారు టీఆర్ఎస్‌ నేతలు. వరినారుతో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలను తయారు చేశారు. ట్రాక్టర్ ర్యాలీలతో హోరెత్తించారు.

ట్రెండింగ్ వార్తలు