Zomato Delivery: తప్పతాగిన పోలీస్.. కారుతో ఢీకొట్టడంతో జొమాటో డెలివరీ బాయ్ దుర్మరణం

పోలీస్ కానిస్టేబుల్ మద్యం తీసుకోవడంతో పాటు అదే మత్తులో డ్రైవింగ్ చేయడం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.

Zomato Delivery: తప్పతాగిన పోలీస్.. కారుతో ఢీకొట్టడంతో జొమాటో డెలివరీ బాయ్ దుర్మరణం

Zomato Deliery

Zomato Delivery: పోలీస్ కానిస్టేబుల్ మద్యం తీసుకోవడంతో పాటు అదే మత్తులో డ్రైవింగ్ చేయడం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తండ్రి కొవిడ్-19తో మృతి చెందగా ఇంటికి అన్నీ తానై నెట్టుకొస్తున్న సలీల్ త్రిపాఠీని పోలీస్ కార్ ఢీకొట్టింది.

తమ వద్ద పనిచేసిన జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ కుటుంబానికి వీలైనంత సపోర్ట్ అందిస్తామని జొమాటో చెప్పింది.

బుద్ధ్ విహార్ ప్రాంతంలో జనవరి 8న ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన కార్.. డీటీసీ బస్, బైక్ రైడర్ ను ఢీ కొట్టింది. ఢిల్లీలోని రోహిణీ నార్త్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మహేంద్ర ఫుల్లుగా తాగి డ్రైవ్ చేశాడని స్థానికులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : కరోనా కల్లోలం, బార్లు, రెస్టారెంట్లు మూసివేసే అవకాశం

ఘటన జరిగిన సమయంలో స్థానికులు వీడియో తీశారు. వీడియో ఆధారంగా మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.